Breaking News

ఇన్ యాక్టివ్ ఫోలియోలకు ‘మిత్రా’ సాయం

Published on Wed, 02/12/2025 - 21:14

యాక్టివ్‌లోలేని లేదా క్లెయిమ్ చేయని మ్యూచువల్ ఫండ్ ఫోలియోలకు సంబంధించి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) ఇన్వెస్టర్లకు తీపికబురు అందించింది. సదరు ఫండ్‌ ఫోలియోలను ట్రాక్ చేసేందుకు, వాటిని తిరిగి పొందేందుకు పెట్టుబడిదారులకు సహాయపడటానికి సెబీ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ మెంట్ ట్రేసింగ్ అండ్ రిట్రీవల్ అసిస్టెంట్ (మిత్రా) అనే కొత్త డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను ప్రవేశపెట్టింది.

పెట్టుబడుల సమాచారం మిస్‌ అవ్వడం లేదా తమ పేరుతో చేసిన పెట్టుబడుల గురించి నామినీలకు తెలియకపోవడం వల్ల మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులను ట్రాక్‌ చేయలేకపోతున్నామనే ఆందోళనలు పెరుగుతున్నాయి. అలాంటి వారికోసం కొత్తగా ప్రవేశపెట్టిన మిత్రా ఎంతో సహకరిస్తుందని సెబీ తెలిపింది. యాక్టివ్‌లోలేని, క్లెయిమ్ చేయని మ్యూచువల్ ఫండ్ ఫోలియోల వివరాలను డేటాబేస్ నుంచి శోధించి ‘మిత్రా’ పెట్టుబడిదారులకు సమాచారం అందిస్తుంది. పెట్టుబడుల సమాచారాన్ని విస్మరించినా  లేదా ఇతరులు చేసిన ఏవైనా పెట్టుబడులను గుర్తించడానికైనా మిత్రా వేదిక అ‍వ్వనుంది.

ఇదీ చదవండి: రూ.50 నోట్లపై గవర్నర్‌ సంతకం మార్పు

ఈ ప్లాట్‌ఫామ్‌ ద్వారా ఇన్వెస్టర్లకు నో యువర్ కస్టమర్ (కేవైసీ) ప్రక్రియను పూర్తి చేసేలా ప్రోత్సహిస్తుంది. నాన్ కేవైసీ కంప్లైంట్ ఫోలియోల సంఖ్యను తగ్గిస్తుంది. మోసపూరిత రిడంప్షన్లను అరికడుతుంది. ఫండ్స్‌, సరైన ఫోలియో ఉన్నప్పటికీ పదేళ్ల పాటు ఎలాంటి నిర్వహణ చేయకపోతే వాటిని నిబంధనల ప్రకారం ఇన్‌యాక్టివ్‌గా పరిగణిస్తారు. అసెట్ మేనేజ్ మెంట్ కంపెనీలు (ఏఎంసీలు), రిజిస్ట్రార్ అండ్ ట్రాన్స్ ఫర్ ఏజెంట్లు (ఆర్టీఏ), రీసెర్చ్ అనలిస్టులు (ఆర్‌ఏ), అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (యాంఫీ), మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్లు సహా అందరు భాగస్వాములకు ఈ ప్లాట్‌ఫామ్‌పై ఇన్వెస్టర్లలో అవగాహన కల్పించాలని సెబీ ఆదేశించింది.

#

Tags : 1

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)