Breaking News

నామినీ అప్‌డేట్‌ గడువు పొడిగింపు: సెబీ

Published on Wed, 03/29/2023 - 06:10

న్యూఢిల్లీ: ప్రస్తుత డీమ్యాట్‌ ఖాతాదారులు, మ్యూచువల్‌ ఫండ్‌(ఎంఎఫ్‌) ఇన్వెస్టర్లకు నామినీ వివరాలు అప్‌డేట్‌ చేయడం లేదా తొలగించేందుకు క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గడువును ఆరు నెలలు పొడిగించింది. ప్రస్తుత గడువు మార్చి 31తో ముగియనుండగా.. ఈ ఏడాది సెప్టెంబర్‌ 30వరకూ అనుమతిస్తూ తాజాగా సర్క్యులర్‌ జారీ చేసింది. 2021 జూలైలో తొలుత అర్హతగల ట్రేడింగ్, డీమ్యాట్‌ ఖాతాదారులంతా 2022 మార్చి31లోగా నామినీ వివరాలు దాఖలు చేయవలసిందిగా సెబీ ఆదేశించింది. ఇలా చేయని ఖాతాలను డెబిట్‌లు చేపట్టేందుకు వీలులేకుండా నిలిపివేయనున్నట్లు తెలియజేసింది.

తదుపరి 2023 మార్చి31లోగా డీమ్యాట్‌ ఖాతాలు, ఎంఎఫ్‌ ఫోలియోలకు నామినీ వివరాలు జత చేయడం తప్పనిసరి చేసింది. వెరసి నామినీ వివరాలు అందించడం లేదా నామినేషన్‌ను ఉపసంహరించేందుకు మరో ఆరు నెలల గడువు లభించింది. 2022 ఆగస్ట్‌1లోగాఎంఎఫ్‌ సబ్‌స్క్రయిబర్లకు నామినీ వివరాలివ్వడం లేదా నామినేషన్‌ నుంచి తప్పుకునేందుకు 2022 జూన్‌లో సెబీ తప్పనిసరి చేసింది. ఆపై 2022 అక్టోబర్‌ 1వరకూ గడువు పెంచింది. తదుపరి 2023 మార్చి31వరకూ మరోసారి గడువు పొడిగించింది. 2021 అక్టోబర్‌ తదుపరి డీమ్యాట్‌ ఖాతాలు తెరిచే ఇన్వెస్టర్లకు డిక్లరేషన్‌ ఫామ్‌ ద్వారా నామినీ వివరాలిచ్చేందుకు వీలు కల్పించింది. ఇదేవిధంగా నామినేషన్‌ను తప్పించేందుకూ వీలుంది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)