బిజినెస్ మ్యాన్ తో పెళ్లైంది... నలుగురు పిల్లలు ఉన్నారు
Breaking News
సెప్టెంబర్ వరకూ ఐపీవో గడువు పెంపు
Published on Wed, 04/08/2026 - 21:29
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా పబ్లిక్ ఇష్యూలతోపాటు.. పబ్లిక్‌కు కనీస వాటా కేటాయింపు గడువును పెంచింది. 2026 ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30లోపు ముగిసిపోయే ఐపీవోల అనుమతుల గడువును 2026 సెప్టెంబర్30 వరకూ పొడిగించింది.
ఇదేవిధంగా పబ్లిక్‌కు కనీసం 25 శాతం వాటా కల్పించే నిబంధనల విషయంలోనూ 2026 సెప్టెంబర్ 30 వరకూ వెసులుబాటు(ఒకేసారి)కు తెరతీసింది. రెండింటికీ విడిగా సర్క్యులర్‌లను జారీ చేసింది. దీంతో ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30లోపు పబ్లిక్‌కు కనీస వాటా నిబంధనలను అమలు చేయవలసిన లిస్టెడ్ కంపెనీలకు 2026 సెప్టెంబర్ 30వరకూ గడువు లభించింది.
గతంలో కరోనా మహమ్మారి తలెత్తిన కాలంలోనూ సెబీ ఇదేతరహా వెసులుబాటును కల్పించిన విషయం విదితమే. పశ్చిమాసియా యుద్ధ భయాల నేపథ్యంలో తలెత్తిన అనిశ్చితి, మార్కెట్ ఆటుపోట్లను దృష్టిలో పెట్టుకుని సెబీ గడువు పెంపునకు నిర్ణయించింది.
Tags : 1