Breaking News

సెబీ చీఫ్‌ రాజీనామా చేయాల్సిందే.. ఉద్యోగుల నిరసన

Published on Thu, 09/05/2024 - 15:30

భారత మార్కెట్ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) చైర్‌పర్సన్‌ మాధవి పూరి బచ్‌పై ఒత్తిడి మరింత పెరుగుతోంది. ఆమె రాజీనామాను డిమాండ్‌ చేస్తూ దాదాపు 200 మంది ఉద్యోగులు సెబీ ముంబై ప్రధాన కార్యాలయం వద్ద నిరసన తెలిపారు.

సెబీలో విధి నిర్వహణ పరిస్థితులపై ఉద్యోగులు ఆర్థిక శాఖకు చేసిన ఫిర్యాదుపై సెబీ ఖండిస్తూ ప్రకటన విడుదల చేసిన మరుసటి రోజే ఉద్యోగులు నిరసనకు దిగారు. మనీకంట్రోల్ నివేదిక ప్రకారం.. నిరసన దాదాపు రెండు గంటల పాటు కొనసాగింది. నిరసన తర్వాత ఉద్యోగులు తిరిగి విధుల్లోకి వెళ్లారు.

తమ ఫిర్యాదుపై ఉన్నతస్థాయి అధికారులు చేస్తున్న వక్రీకరణకు వ్యతిరేకంగా, తమ ఐక్యతను ప్రదర్శించడమే ఈ నిరసన ఉద్దేశం అని ఉద్యోగుల మధ్య అంతర్గత సందేశాన్ని ఉటంకిస్తూ మనీకంట్రోల్ పేర్కొంది. సెబీ ఉద్యోగులపై అసత్యాలు ప్రచారం చేస్తూ విడుదల చేసిన పత్రికా ప్రకటనను ఉపసంహరించుకోవడం, సెబీ చైర్‌పర్సన్ రాజీనామా చేయడం తక్షణ డిమాండ్  అని ఆ సందేశంలో ఉన్నట్లు తెలిపింది.

నిరసన ఎందుకంటే..
సెబీలో పని చేయడం అత్యంత ఒత్తిడితో కూడుకున్నదని, ఇక్కడ విషపూరితమైన పని వాతావరణం ఉందంటూ కొంతమంది సెబీ ఉద్యోగులు గత నెలలో ఆర్థిక శాఖకు ఫిర్యాదు చేస్తూ లేఖ రాశారు. దీన్ని సెబీ తప్పుబట్టింది. పనితీరు, జవాబుదారీతనంలో ప్రమాణాలను పాటించే విషయంలో ఉద్యోగులను బయటి శక్తులు తప్పుదోవ పట్టించాయంటూ సెబీ ప్రకటన విడుదల చేయడం తెలిసిందే.

 

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)