‘ఐసీఐసీఐ నుంచి వేతనం తీసుకున్న సెబీ చీఫ్‌’

Published on Mon, 09/02/2024 - 16:03

సెబీ ఛైర్‌పర్సన్ మాధబిపురి బుచ్‌పై కాంగ్రెస్ పార్టీ సోమవారం తీవ్ర ఆరోపణలు చేసింది. ఆమె 2017 నుంచి 2024 మధ్య ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి రూ.12 కోట్లకు పైగా వేతనం తీసుకున్నారని కాంగ్రెస్‌ ప్రతినిధి పవన్ ఖేరా తెలిపారు. ప్రముఖ సంస్థకు చీఫ్‌గా వ్యవహరిస్తూ వేరే సంస్థ నుంచి వేతనం తీసుకోవడం నిబంధనలకు విరుద్ధమన్నారు.

సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) చీఫ్‌ మాధబి ఐసీఐసీఐ బ్యాంకుతో పాటు 2017-24 మధ్య కాలంలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ నుంచి రూ.22.41 కోట్ల ఆదాయాన్ని పొందారని ఖేరా తెలిపారు. ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి రూ.రెండు కోట్లకు పైగా విలువైన ఇఎస్‌ఓపీని అందుకున్నారని చెప్పారు. అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలపై సెబీ చీఫ్‌​ సరైన విచారణ నిర్వహించకపోవచ్చని అనుమానం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: మెరుగైన మౌలిక సదుపాయాలతో దేశం వృద్ధి

అసలేం జరిగిందంటే..

బెర్ముడా, మారిషస్‌ల్లోని అదానీ గ్రూప్‌ డొల్ల కంపెనీల్లో మాధబీ దంపతులకు వాటాలున్నట్టు ఇటీవల విడుదల చేసిన తాజా నివేదికలో హిండెన్‌బర్గ్‌ వెల్లడించింది. ఆ కంపెనీల్లో వారిద్దరూ కోటి డాలర్ల మేరకు పెట్టుబడులు పెట్టినట్టు నివేదిక తెలిపింది. భారత్‌లో పెట్టుబడులకు ఎన్నో మ్యూచువల్‌ ఫండ్లు తదితరాలుండగా ఏరి కోరి పన్ను ఎగవేతదారుల స్వర్గధామంగా పేరొందిన దేశాల్లో, అదీ అదానీలకు చెందిన డొల్ల కంపెనీల్లోనే పెట్టడం ఆశ్చర్యకరమని పేర్కొంది. అదానీల ఆర్థిక అవకతవకల్లో ఏకంగా సెబీ చీఫే భాగస్వామి కావడంతో లోతుగా విచారణ జరిపేందుకు సెబీ వెనకడుగు వేసిందని ఆరోపించింది.

#

Tags : 1

Videos

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)