Breaking News

ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు చెక్‌ పెట్టాలి

Published on Thu, 09/04/2025 - 09:04

ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ నియంత్రణలను పాటించడం బ్యాంకుల యాజమాన్యాల నైతిక బాధ్యత అని సెబీ చైర్మన్‌ తుహిన్‌ కాంత పాండే గుర్తు చేశారు. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ఉల్లంఘనలను గుర్తించి, నివారించేందుకు వీలుగా అంతర్గత నియంత్రణలను బలోపేతం చేసుకోవాలని సూచించారు.

‘అంతర్గత నియంత్రణలు బలహీనంగా ఉన్నప్పుడు, ప్రక్రియలు అస్పష్టంగా ఉన్నప్పుడు, బాధ్యతలను సరిగ్గా నిర్వచించనప్పుడు, పర్యవేక్షణ సరిగ్గా లేనప్పుడు ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ రిస్క్‌ పెరుగుతుంది’ అని పాండే తెలిపారు. చాలా మోసాలకు అంతర్గత నియంత్రణలు బలహీనంగా ఉండడమే కారణమన్నారు. ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ మాజీ ఎండీ–సీఈవో, డిప్యూటీ సీఈవోలు బయటకు వెల్లడించని సున్నిత సమాచారం (యూపీఎస్‌ఐ) ఆధారంగా బ్యాంక్‌ షేర్లలో ట్రేడింగ్‌ నిర్వహించినట్టు తేలుస్తూ, సెబీ ఇటీవలే చర్యలు ప్రకటించడం గమనార్హం. దీంతో సెబీ చైర్మన్‌ తాజా సూచనలకు ప్రాధాన్యం నెలకొంది.

అంతర్గతంగా బలమైన నియంత్రణలు ఏర్పాటు చేసుకోవడం, వెంటనే సమాచారాన్ని స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు వెల్లడించడం, తమ బాద్యతల పట్ల ఉద్యోగుల్లో స్పష్టమైన అవగాహన కల్పించడం ద్వారా ప్రతి సున్నిత సమాచారం విషయంలో జవాబుదారీ తనం ఉండేలా చూడొచ్చని అభిప్రాయపడ్డారు. సమావేశాల్లో సున్నిత సమాచారాన్ని అనధికారికంగా పంచుకోవడం, ఈమెయిల్‌ రూపంలో తెలియజేసినా దాన్ని ఉల్లంఘనగానే పరిగణించాలని పేర్కొన్నారు. ‘ఒక్కసారి సమచారం లీక్‌ అయితే సెకన్లలోనే డిజిటల్‌ నెట్‌వర్క్‌లపైకి చేరిపోతుంది. దాంతో స్టాక్‌ ధరలకు, ఇన్వెస్టర్ల విశ్వాసం, బ్యాంకు ప్రతిష్టకు జరిగే నష్టాన్ని భర్తీ చేయలేం’ అని పేర్కొన్నారు.

 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)