Breaking News

మాటిమాటికీ.. బ్రేక్‌డౌన్‌లేంటి..

Published on Wed, 11/05/2025 - 08:10

మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్‌(ఎంసీఎక్స్‌)లో పదే పదే సాంకేతిక సమస్యలు వస్తుండటంపై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చైర్మన్‌ తుహిన్‌ కాంత పాండే అసహనం వ్యక్తం చేశారు. తాజా సమస్యను అధ్యయనం చేసిన మీదట అవసరమైతే సెబీ స్వయంగా తగిన చర్యలు తీసుకుంటుందని ఆయన చెప్పారు. ఇలాంటి విషయాల్లో సెబీ ప్రామాణికమైన ప్రోటోకాల్స్‌ను పాటిస్తుందని పాండే పేర్కొన్నారు.

‘జూలైలో ఒకసారి సమస్య వచ్చింది. ఇదిగో ఇప్పుడు మరొకటి. ఇలా మాటిమాటికీ సమస్యలు వస్తుండటం సరికాదు’ అని ఆయన చెప్పారు. డిజిటలీకరణ వేగవంతం అవుతున్న నేపథ్యంలో వ్యాపారాలకు అంతరాయాలు తలెత్తకుండా మార్కెట్‌ ఇంటర్మీడియరీలు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని, క్లయింట్ల డేటా..కీలకమైన మౌలిక సదుపాయాలకు నష్టం వాటిల్లకుండా సైబర్‌ సెక్యూరిటీపై మరింతగా దృష్టి పెట్టాల్సి ఉంటుందని పాండే పేర్కొన్నారు. గత నెల ఎంసీఎక్స్‌లో పెద్ద స్థాయిలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ట్రేడింగ్‌కి తీవ్ర అంతరాయం ఏర్పడిన సంగతి తెలిసిందే.

ఇదీ చదవండి: గోపీచంద్‌ హిందూజా కన్నుమూత

Videos

బాబుకు హైకోర్టు బిగ్ షాక్.. జోగి రమేష్ దెబ్బ అదుర్స్..!

మోదీని కలిసిన భారత మహిళల క్రికెట్ జట్టు

తెలుగు మూవీలో కుంభమేళా పూసల పిల్ల

రన్నింగ్ బస్సులో మంటలు.. RTC బస్సు దగ్ధం..!

ACB రైడ్స్.. బయటపడ్డ కూటమి అవినీతి బాగోతాలు

దద్దరిల్లుతున్న పెద్ది సాంగ్ ప్రోమో.. దుమ్మురేపుతున్న రామ్ చరణ్ డాన్స్

YSRCP మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావుకు గుండెపోటు

అజారుద్దీన్ పై కాంగ్రెస్ మహిళ నేత షాకింగ్ కామెంట్స్..

పవన్ నీ సొల్లు కబుర్లు ఆపు.. లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిన జడ శ్రవణ్

రాసిపెట్టుకో ఈశ్వర్.. రేవంత్ కథ అక్కడే ముగుస్తుంది

Photos

+5

ఎన్నికల వేళ అరుదైన చిత్రాలు.. బిహార్‌ ఓటర్ల ప్రత్యేక (ఫొటోలు)

+5

#KotiDeepotsavam : ఎన్టీఆర్ స్టేడియంలో ఘనంగా కోటి దీపోత్సవం (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కోటి దీపోత్సవం (ఫొటోలు)

+5

విష్ణు విశాల్‌ ’ఆర్యన్‌‘ మూవీ ప్రీ రిలీజ్‌ (ఫొటోలు)

+5

ప్రధాని మోదీని కలిసిన విశ్వ విజేతలు (ఫొటోలు)

+5

రష్మికా ‘ది గర్ల్‌ ఫ్రెండ్‌’ సినిమా ప్రీ రిలీజ్‌ ప్రెస్‌మీట్‌ (ఫొటోలు)

+5

పెళ్లి ఫోటోలు షేర్‌ చేసిన నారా రోహిత్ (ఫోటోలు)

+5

తిరుమలలో బుల్లితెర నటుడు ప్రభాకర్‌ (ఫోటోలు)

+5

వేయి స్తంభాల దేవాలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలు (ఫోటోలు)

+5

జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకాలు.. సింగర్‌ ఎమోషనల్‌ (ఫోటోలు)