మెహుల్‌ చోక్సీ ఖాతాల అటాచ్‌ 

Published on Sun, 06/08/2025 - 06:41

న్యూఢిల్లీ: క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా మెహుల్‌ చోక్సీ ఆస్తులను అటాచ్‌ చేసేందుకు ఆదేశించింది. వీటిలో చోక్సీ బ్యాంక్‌ ఖాతాలు, షేర్లు, మ్యూచువల్‌ ఫండ్‌ హోల్డింగ్స్‌ ఉన్నాయి. జ్యువెలరీ కంపెనీ గీతాంజలి జెమ్స్‌ ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ నిబంధనల ఉల్లంఘన కేసులో సెబీ రూ. 2.1 కోట్లు రికవర్‌ చేసుకునేందుకు తాజా ఆదేశాలు జారీ చేసింది. గత నెల 15న చోక్సీకి డిమాండ్‌ నోటీసు జారీ చేసిన సెబీ 15 రోజుల గడువు ముగియడంతో రికవరీ చర్యలకు తెరతీసింది. 

ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ కేసు నేపథ్యంలో 2022 జనవరిలోనూ సెబీ జరిమానా విధించింది. అయితే చెల్లింపులు చేపట్టకపోవడంతో డిమాండ్‌ నోటీసు జారీ చేసింది. గీతాంజలి జెమ్స్‌ చైర్మన్, ఎండీ చోక్సీ ప్రమోటర్‌ గ్రూప్‌లోని వ్యక్తికావడంతోపాటు.. నీరవ్‌ మోడీకి మేనమామకూడా. ప్రభుత్వ రంగ పీఎన్‌బీలో రూ. 14,000 కోట్లమేర మోసానికి తెరతీసినట్లు ఇరువురిపైనా కేసు నమోదైన సంగతి తెలిసిందే. అయితే పీఎన్‌బీని మోసగించిన అంశం వెలుగుచూసిన 2018 మొదట్లో వీరిరువురూ విదేశాలకు పారిపోగా.. చోక్సీని బెల్జియంలోనూ, మోడీని స్కాట్లాండ్‌లోనూ అక్కడి ప్రభుత్వాలు అరెస్ట్‌ చేయడం గమనార్హం! 
 

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)