Breaking News

ఐపీవోకు 6 కంపెనీలు రెడీ

Published on Thu, 06/05/2025 - 04:30

క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా ఆరు కంపెనీల ఐపీవో ప్రణాళికలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ జాబితాలో ప్రయివేట్‌ రంగ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ అనుబంధ సంస్థ హెచ్‌డీబీ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌సహా డార్ఫ్–కెటల్‌ కెమికల్స్, విక్రమ్‌ సోలార్‌ తదితరాలు చేరాయి. 

ఈ ఆరు కంపెనీలు పబ్లిక్‌ ఇష్యూల ద్వారా ఉమ్మడిగా రూ. 20,000 కోట్లకుపైగా సమీకరించాలని ప్రణాళికలు వేశాయి. 2024 అక్టోబర్‌– 2025 జనవరి మధ్య సెబీకి ప్రాస్పెక్టస్‌ దాఖలు చేశాయి. సెబీ అనుమతి పొందిన జాబితాలో ఏవన్‌ స్టీల్స్‌ ఇండియా, శాంతి గోల్డ్‌ ఇంటర్నేషనల్, శ్రీజి షిప్పింగ్‌ గ్లోబల్‌ సైతం ఉన్నాయి. గత నెలలో వచి్చన ఐదు ఐపీవోలతో కలసి 2025లో ఇప్పటివరకూ 16 కంపెనీలు లిస్టింగ్‌ బాటలో సాగడం గమనార్హం!

రూ. 12,500 కోట్లపై కన్ను
ఐపీవోలో  హెచ్‌డీబీ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రూ. 2,500 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా రూ. 10,000 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్‌ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఆఫర్‌ చేయనుంది. ఎన్‌బీఎఫ్‌సీలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 94.36 శాతం వాటా కలిగి ఉంది. ఈక్విటీ జారీ నిధులను టైర్‌–1 మూలధన పటిష్టతకు వెచ్చించనుంది.

రూ. 5,000 కోట్లకు రెడీ
 డార్ఫ్–కెటల్‌ కెమికల్స్‌ ఐపీవోలో రూ. 1,500 కోట్ల విలువైన ఈక్విటీని జారీ చేయనుంది. మరో రూ. 3,500 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్‌ సంస్థ మెనన్‌ ఫ్యామిలీ హోల్డింగ్స్‌ ట్రస్ట్‌ విక్రయానికి ఉంచనుంది. తద్వారా రూ. 5,000 కోట్లు సమకూర్చుకోనుంది. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 829 కోట్లు రుణ చెల్లింపులకు, రూ. 333 కోట్లు అనుబంధ సంస్థలో పెట్టుబడికి వెచ్చించనుంది.  

సోలార్‌ మాడ్యూల్‌ సంస్థ 
ఐపీవోలో  విక్రమ్‌ సోలార్‌ రూ. 1,500 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 17.45 మిలియన్‌ షేర్లను ప్రమోటర్, ప్రమోటర్‌ గ్రూప్‌ సంస్థలు విక్రయించనున్నాయి. ఐపీవో నిధుల్లో రూ. 793 కోట్లు అనుబంధ సంస్థ వీఎస్‌ఎల్‌ గ్రీన్‌ పవర్‌ పెట్టుబడి వ్యయాలకు కేటాయించనుంది. తద్వారా 3,000 మెగావాట్ల సోలా ర్‌ సెల్‌ మాడ్యూల్‌ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది.

లాజిస్టిక్స్‌ సొల్యూషన్ల సంస్థ 
షిప్పింగ్, లాజిస్టిక్స్‌సొల్యూషన్లు అందించే శ్రీజి షిప్పింగ్‌ గ్లోబల్‌ ఐపీవోలో భాగంగా 2 కోట్ల ఈక్విటీ షేర్లను కొత్తగా జారీ చేయనుంది. ప్రధానంగా డ్రై బల్క్‌ కార్గోకు సేవలందించే కంపెనీ ఇష్యూ నిధుల్లో రూ. 289 కోట్లు సూపర్‌మ్యాక్స్‌ విభాగంలో సెకండరీ మార్కెట్‌ నుంచి డ్రై బల్క్‌ క్యారియర్స్‌ కొనుగోలుకి వెచ్చించనుంది. మరో 
రూ. 20 కోట్లు రుణ చెల్లింపులకు కేటాయించనుంది.  

ఏవన్‌ స్టీల్స్‌ ఇండియా సై 
ఐపీవోలో  భాగంగా ఏవన్‌ స్టీల్స్‌ ఇండియా రూ. 600 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 50 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు ఆఫర్‌ చేయనున్నారు. ఈక్విటీ జారీ నిధులను అనుబంధ సంస్థ వన్యా స్టీల్స్‌లో పెట్టుబడులకు వినియోగించనుంది. తద్వారా మెషీనరీ కొనుగోలు, తయారీ సామర్థ్య విస్తరణ, విద్యుత్‌ యూనిట్‌ ఏర్పాటు, రుణ చెల్లింపులు చేపట్టనుంది.

బంగారు ఆభరణ కంపెనీ 
పబ్లిక్‌ ఇష్యూలో భాగంగా బంగారు ఆభరణాల తయారీ కంపెనీ శాంతి గోల్డ్‌ ఇంటర్నేషనల్‌ 1.8 కోట్ల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. ఇష్యూ నిధుల్లో రూ. 46 కోట్లు జైపూర్‌ యూనిట్‌ ఏర్పాటుకు వెచ్చించనుంది. మరో రూ. 190 కోట్లు వర్కింగ్‌ క్యాపిటల్‌ అవసరాలకు, రూ. 20 కోట్లు రుణ చెల్లింపులకు కేటాయించనుంది.  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)