Breaking News

రెండు ఐపీవోలకు సెబీ గ్రీన్‌ సిగ్నల్‌

Published on Tue, 11/26/2024 - 09:14

రియల్టీ సంస్థ కల్పతరు లిమిటెడ్‌తోపాటు, హైప్రెసిషన్‌ ఇంజినీరింగ్‌ కంపెనీ యూనిమెక్‌ ఏరోస్పేస్‌ అండ్‌ మ్యాన్యుఫాక్చరింగ్‌ పబ్లిక్‌ ఇష్యూకి రానున్నాయి. ఇందుకు క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఐపీవోలో కల్పతరు పూర్తిగా తాజా ఈక్విటీని జారీ చేయనుంది. యూనిమెక్‌ ఏరోస్పేస్‌ తాజాగా ఈక్విటీ జారీసహా ప్రమోటర్లు షేర్లను ఆఫర్‌ చేయనున్నారు. ఈ ఏడాది ఆగస్టులో రెండు కంపెనీలు సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌లను దాఖలు చేశాయి.

రూ.1,590 కోట్లపై దృష్టి

కల్పతరు కంపెనీ ప్రాస్పెక్టస్‌ ప్రకారం సంస్థ ఐపీవోలో భాగంగా రూ.1,590 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. ఐపీవో నిధుల్లో దాదాపు రూ.1,193 కోట్లు కల్పతరు గ్రూప్‌ కంపెనీ రుణ చెల్లింపులకు వెచ్చించనుంది. కల్పతరు గ్రూప్‌లో కల్పతరు ప్రాజెక్ట్స్‌ ఇంటర్నేషనల్, ప్రాపర్టీ సొల్యూషన్స్‌(ఇండియా), శ్రీ శుభం లాజిస్టిక్స్‌ ఉన్నాయి.

ఇదీ చదవండి: అంతా ఓకే.. కేవలం వ్యక్తులపైనే ఆరోపణలు..

రూ.500 కోట్ల సమీకరణ

ఐపీవోలో భాగంగా యూనిమెక్‌ ఏరోస్పేస్‌ రూ.250 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా ప్రమోటర్లు మరో రూ.250 కోట్ల విలువైన షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధుల్లో కొంతమేర మెషీనరీ, పరికరాల కొనుగోలు ద్వారా విస్తరణకు వినియోగించనుంది. ఈ బాటలో వర్కింగ్‌ క్యాపిటల్‌ అవసరాలు, రుణ చెల్లింపులు తదితరాలకు సైతం 
నిధులను వెచ్చించనుంది.

Videos

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)