Breaking News

ఫండ్‌ ఇన్వెస్టర్లకు సెబీ ‘మిత్రా’ ప్లాట్‌ఫామ్‌

Published on Sun, 02/16/2025 - 07:26

న్యూఢిల్లీ: మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇన్వెస్టర్ల కోసం ‘మిత్రా’ డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ను సెబీ తీసుకొచ్చింది. మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఎప్పుడో ఇన్వెస్ట్‌ చేసి, వాటి వివరాలు మర్చిపోయిన వారు, దీర్ఘకాలంగా ఎలాంటి లావాదేవీలు లేకుండా ఉండిపోయిన వాటిని సులభంగా గుర్తించేందుకు ఈ ప్లాట్‌ఫామ్‌ సాయపడనుంది. ఇలాంటి చురుగ్గాలేని (ఇనాక్టివ్‌), చాలా కాలంగా క్లెయిమ్‌ చేయకుండా ఉండిపోయిన (అన్‌క్లెయిమ్డ్‌) పెట్టుబడులను తిరిగి గుర్తించి, వెనక్కి తీసుకోవడానికి ఈ చర్య తీసుకుంది.

గతంలో చేసిన పెట్టుబడుల వివరాలను మర్చిపోయి, తాజా కాంటాక్ట్‌ సమాచారం లేక, తమ పేరిట చేసిన పెట్టుబడులపై అవగాహన లేని వారి విషయంలో వ్యక్తమవుతున్న ఆందోళనలకు ఈ ప్లాట్‌ఫామ్‌ పరిష్కారం చూపుతుందని సెబీ తన తాజా సర్క్యులర్‌లో వెల్లడించింది. ఈ తరహా యాక్టివ్‌గా లేని ఫోలియోలు (పెట్టుబడులు) మోసపూరిత ఉపసంహరణలకు దారితీయవచ్చని పేర్కొంది.

రిజిస్టార్ అండ్‌ ట్రాన్స్‌ఫర్‌ ఏజెంట్లు అభివృద్ధి చేసిన ఈ ప్లాట్‌ఫామ్‌.. క్లెయిమ్‌ చేయకుండా పేరుకుపోయిన పెట్టుబడులను తగ్గించేందుకు సాయపడుతుందని పేర్కొంది. పదేళ్లుగా పెట్టుబడులు, మరే ఇతర ఆర్థికేతర లావాదేవీలు లేకుండా ఉండిపోయిన పెట్టుబడులను ఇనాక్టివిగా పరిగణిస్తుంటారు. ఇన్వెస్టర్లకు సంబంధించి ఇనాక్టివ్‌ ఫోలియోలు, అన్‌క్లెయిమ్డ్‌ డివిడెండ్‌లను గుర్తించి.. వాటిని తగ్గించే బాధ్యతను ‘యూనిట్‌ హోల్డర్‌ ప్రొటెక్షన్‌ కమిటీ’పై పెట్టింది. తాజా చర్యల గురించి ఇన్వెస్టర్లలో అవగాహన కల్పించాలంటూ ఏఎంసీలు, ఆర్‌టీఏలు, ఆర్‌ఐఏలు, యాంఫి, మ్యూచువల్‌ ఫండ్స్‌ పంపిణీదారులను సెబీ ఆదేశించింది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)