Breaking News

జుక్‌.. జాబ్స్‌.. గేట్స్‌.. వీళ్ల సీక్రెట్‌ ఇదేనా?

Published on Sat, 05/03/2025 - 12:11

స్టీవ్ జాబ్స్.. బిల్ గేట్స్.. మార్క్ జుకర్‌బర్గ్.. ముగ్గురూ టెక్‌ ప్రపంచాన్ని శాసించి బిలియన్‌ డాలర్లు సంపాదించిన వ్యాపారాధినేతలు. వీరి విజయ రహస్యమేంటో తెలిసి​పోయింది! బలమైన నాయకత్వం, వ్యూహాత్మక దార్శనికత, సమర్థవంతమైన కమ్యూనికేషన్ ప్రధాన లక్షణాలుగా ఉన్నప్పటికీ, ఈ ముగ్గురికీ సారూప్యత ఉన్న అంశం మరొకటి ఉందని డొనాల్డ్ జి కాస్టెల్లో కాలేజ్ ఆఫ్ బిజినెస్ పరిశోధకులు వెల్లడించారు.

ఒకటే చేతివాటం
ఈ ముగ్గురు సీఈఓలు ఎడమచేతి వాటం వారే. జర్నల్ ఆఫ్ బిహేవియరల్ అండ్ ఎక్స్‌పెరిమెంటల్ ఫైనాన్స్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. ఎడమచేతివాటం కలిగిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఆవిష్కరణలు, విజయవంతమైన కంపెనీలతో దూసుకెళ్లడానికి, వారి ఎడమ చేతి వాటానికి సంబంధం ఉంది. కుటుంబ అనుభవాలు, జన్యుపరమైన వారసత్వం, అకడమిక్ నేపథ్యం, వారు ఎంచుకున్న కెరీర్ మార్గాలు, ఇంకా మరెన్నో అంశాలు కూడా సీఈఓల విజయాలకు కారణం కావచ్చని అధ్యయన సహ రచయిత ప్రొఫెసర్ లాంగ్ చెన్ తెలిపారు.

ఈ అధ్యయనం కోసం పరిశోధకులు 472 కంపెనీలకు చెందిన 1,000 మందికి పైగా సీఈవోలను విశ్లేషించారు. రాయడం, గీయడం, తినడం, విసరడం వంటి కార్యకలాపాల్లో నిమగ్నమైన సీఈఓల ఫొటోలు, వీడియోలను పరిశీలించి వారి ఆధిపత్యాన్ని నిర్ధారించారు. అనుమానం వచ్చినప్పుడు ఆయా కంపెనీలకు ఫోన్లు చేయడం లేదా వివరణ కోసం ఈమెయిల్స్ పంపడం చేసేవారు. వారు ఏ చేతి మణికట్టుపై వాచీలు ధరించారో కూడా తాము గమనించామని అధ్యయనకర్తలు చెప్పుకొచ్చారు. సాధారణంగా ఎడమచేతి వాటం ఉన్నవారు వాచీని తమ కుడి చేతికి ధరిస్తారు.

అధ్యయన ఫలితాలు

  • సీఈఓల్లో అత్యధికులు కుడిచేతి వాటం వారే. వీరు 91.4 శాతం మంది ఉండగా 7.9 శాతం మంది మాత్రమే ఎడమచేతి వాటం వారున్నారు. 0.7 శాతం మంది రెండు చేతివాటాలున్నవారు తేలారు. లెఫ్ట్ హ్యాండ్ సీఈఓల నేతృత్వంలోని సంస్థలు గణనీయంగా అధిక సృజనాత్మక ఉత్పత్తిని ప్రదర్శించాయని, మరింత ప్రత్యేకమైన పేటెంట్లను కలిగి ఉన్నాయని తదుపరి విశ్లేషణలో వెల్లడైంది.

  • ఏదైనా సంస్థ కుడిచేతివాటం ఉన్న సీఈవో నుంచి ఎడమచేతివాటం సీఈఓకి చేతుల్లోకి మారిన తర్వాత  ఆ సంస్థ పేటెంట్లు, ప్రశంసాపత్రాల సంఖ్య మరింత పెరుగుతోందని ఫలితాలు సూచిస్తున్నాయి. అదే సమయంలో ఎడమచేతివాటం సీఈవో నుంచి కుడిచేతివాటం సీఈఓకి మారిన కంపెనీల ఇన్నోవేషన్ అవుట్‌పుట్‌లో ఇలాంటి మార్పు కనిపించడం లేదని అధ్యయనం పేర్కొంది.

  • ఎడమచేతివాటం సీఈఓలు నిర్వహించే సంస్థలు ఎక్కువ మంది విదేశీ ఉద్యోగులను నియమించుకునే అవకాశం ఉంటుంది. వారు దేశీయ ఉద్యోగుల కంటే ఎక్కువ ఇన్నోవేషన్ అవుట్ పుట్ ఇస్తారని భావిస్తారు.

  • కుడిచేతివాటం సీఈవోలతో పోలిస్తే   ఎడమచేతివాటం సీఈవోలు కాస్త ఎక్కువ ఓపెన్ మైండెడ్ గా ఉంటారు. సృజనాత్మకతను ప్రోత్సహించడంలోనూ ముందుంటారు.

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)