Breaking News

సమయమే ముఖ్యమా.. చేసేపని కాదా?

Published on Thu, 08/07/2025 - 11:51

సమయపాలన చాలా అవసరం అని చిన్నప్పుడే బడిలో చదువుకున్నాం. ఈ విధానాన్ని ఇప్పటికి కూడా కొన్ని కంపెనీలు అమలు చేస్తున్నాయి. ఉద్యోగులందరూ ఖచ్చితమైన సమయానికి కార్యాలయానికి చేరుకోవాలని షరతులు కూడా పెడుతున్నాయి. అయితే ఇది సమంజసంగా లేదని ఓ రెడ్దిట్ యూజర్ పేర్కొన్నారు. దీనికి సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ రోజు ఒక విషయాన్ని నేను పంచుకోవాలనుకున్నాను. ఎందుకంటే కొన్ని భారతీయ కంపెనీలు ఇప్పటికీ పాఠశాల సంస్కృతిని పాటిస్తున్నాయి. అది నన్ను చాలా ఆశ్చర్యపరిచింది. ఉద్యోగులందరూ ఉదయం 9:30 గంటలకు తప్పకుండా ఆఫీసుకు రావాలి. ఆలస్యమైతే సగం రోజు లీవుగా పరిగణించడం జరుగుతుందని మా టీమ్ చాట్‌లో అధికారిక మెసేజ్ చేశారు.

ఆలస్యమైతే.. ముందుగా తెలియజేయాలి. ఎవరికీ తెలియజేయకుండా ఆలస్యంగా వస్తే మాత్రం హాఫ్-డేగా పరిగణలోకి తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ విషయాన్ని పేర్కొంటూ.. మనం ఇంకా స్కూల్లోనే ఉన్నామా?, పెద్దవాళ్లమయ్యామా? అని రెడ్దిట్ యూజర్ పేర్కొన్నారు.

భారతదేశంలోని చాలా కంపెనీలు ఇప్పటికీ 'సమయానికి రిపోర్ట్ చేయండి లేదా శిక్ష అనుభవించండి' అనే పాతకాలపు మనస్తత్వాన్ని ఎందుకు పట్టుకుంటున్నాయి? చేసే పని ముఖ్యం కాదా? అని రెడ్దిట్ అన్నారు. ఈ పోస్టుపై నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్ చేస్తున్నారు.

ఇదీ చదవండి: ఎవరైనా కోటీశ్వరులు కావచ్చు: రాబర్ట్ కియోసాకి

కొందరు తమ అనుభవాలను షేర్ చేసుకుంటున్నారు. ఆఫీసులకు ఆలస్యంగా వెళ్తే.. యజమానులు ఎంత కఠినంగా వ్యవహరిస్తారో పేర్కొన్నారు. ఆలస్యంగా వస్తే పనిష్మెంట్ ఉంటుంది.. కానీ అదనపు వర్క్ చేసినప్పుడు ఎలాంటి ప్రోత్సాహకం ఉండదని ఒకరు అన్నారు. మారుతున్న కాలంతోపాటు మనం కూడా మారాలి. ప్రభుత్వ కార్యాలయాలలో కూడా అదే విధానాలు ఉన్నాయి కానీ చాలా అరుదుగా అమలు చేస్తాని మరొకరు పేర్కొన్నారు.

Videos

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)