Breaking News

ఆట బొమ్మల ఉత్పత్తికి ప్రోత్సాహం.. త్వరలో కొత్త పథకం

Published on Sat, 07/05/2025 - 16:20

పరిశ్రమతో సంప్రదింపుల అనంతరం దేశంలో ఆట బొమ్మల ఉత్పత్తిని (టాయ్స్‌) పెంచేందుకు త్వరలోనే ఓ పథకాన్ని ఖరారు చేయనున్నట్టు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ తెలిపారు. టాయ్స్‌ తయారీకి, ఎగుమతులకు భారీ అవకాశాలున్నట్టు చెప్పారు. టాయ్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (టీఏఐ) ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా మంత్రి గోయల్‌ మాట్లాడారు.

ప్రభుత్వం తీసుకొచ్చే పథకం ఎగుమతులకు ప్రోత్సాహకాల రూపంలో ఉండదని.. దేశీయంగా తయారీని పెంచేందుకు, ఉపాధి కల్పనకు ఊతమిస్తుందన్నారు. డిజైన్‌ సామర్థ్యాలు, నాణ్యతతో కూడిన తయారీ, బ్రాండ్‌ నిర్మాణానికి మద్దతు రూపంలో ఈ పథకం ఉంటుందని చెప్పారు. ఒకప్పుడు ఆట బొమ్మల కోసం దిగుమతులపైనే పూర్తిగా ఆధారపడగా.. ప్రస్తుతం దేశీయంగానే పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయడంతోపాటు, 153 దేశాలకు ఎగుమతులు చేస్తున్నట్టు మంత్రి చెప్పారు. విధానపరమైన మద్దతు చర్యలు, నాణ్యతా ప్రమాణాల అమలు, స్థానిక తయారీ క్లస్టర్లను బలోపేతం చేయడం ద్వారా ఇది సాధ్యమైనట్టు వివరించారు.

140 కోట్ల జనాభా కలిగిన దేశం కావడంతో తయారీ కార్యకలాపాల విస్తరణతో సహజ ప్రయోజనం కలుగుతుందన్నారు. ఆట బొమ్మల ఎగుమతులను పెంచుకునేందుకు చక్కని బ్రాండింగ్, ఆకర్షణీయమైన ప్యాకింగ్, బలమైన డిజైన్‌పై దృష్టి సారించాలని పరిశ్రమకు గోయల్‌ సూచించారు. వినూత్నమైన ఆట»ొమ్మల నమనాలను అభివృద్ధి చేసిన స్టార్టప్‌లకు పీఎం ముద్రాయోజన కింద పెద్ద ఎత్తున నిధుల మద్దతు అందించినట్టు చెప్పారు.

Videos

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)