Breaking News

ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల వాదనకు ఎస్‌బీఐ కౌంటర్‌

Published on Wed, 09/03/2025 - 11:14

వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) రేట్ల హేతుబద్ధీకరణపై సెప్టెంబర్‌ 3, 4వ తేదీల్లో జరుగుతున్న కౌన్సిల్‌ సమావేశాల నేపథ్యంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదిక చర్చనీయాంశమైంది. ఇటీవల ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు లేవనెత్తిన ఆందోళనలకు ఎస్‌బీఐ తాజా పరిశోధన నివేదిక కౌంటర్‌గా ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. 53వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశానికి ముందు మంగళవారం విడుదల చేసిన ఈ అధ్యయనం ప్రకారం 2026 ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ, పన్నుల పంపిణీ ద్వారా మొత్తం రాష్ట్రాల ఆదాయం రూ.14 లక్షల కోట్లు దాటుతుందని ఎస్‌బీఐ అంచనా వేసింది.

ఎస్‌బీఐ గ్రూప్ చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్, 16వ ఆర్థిక సంఘం సభ్యురాలు సౌమ్య కాంతి ఘోష్ నేతృత్వంలోని బృందం ఈ రీసెర్చ్ పేపర్లను విడుదల చేశారు. కొత్త పన్నుల క్రమబద్ధీకరణ వల్ల స్టేట్ జీఎస్టీ (ఎస్‌జీఎస్టీ) వసూళ్లలో రూ.10 లక్షల కోట్లు, పన్ను వికేంద్రీకరణ ద్వారా అదనంగా రూ.4.1 లక్షల కోట్లు వస్తాయని అంచనా వేశారు. జీఎస్టీ శ్లాబుల హేతుబద్ధీకరణ తర్వాత కూడా 2026 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రాలు పన్నుల పరంగా నికర లాభాలు ఆర్జిస్తున్నాయని నివేదిక తెలిపింది. తక్కువ జీఎస్టీ రేట్ల ఫలితంగా వినియోగం పెరిగి అదనపు ఆదాయం సమకూరుతుందని చెప్పింది.

ప్రతిపక్ష రాష్ట్రాల ఆందోళన

గతవారం కర్ణాటక, కేరళ, పశ్చిమబెంగాల్, తమిళనాడు, పంజాబ్ సహా ఎనిమిది ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు జీఎస్టీ వల్ల ఆదాయ నష్టాలను హైలైట్‌ చేస్తూ ప్రభుత్వానికి వినతిపత్రం సమర్పించాయి. జీఎస్టీ రేట్ల కోత, పరిహార సెస్ రద్దు కారణంగా రాష్ట్రాలకు వచ్చే ఆదాయంపై ప్రభుత్వం స్పష్టత కొరవడినట్లు కేంద్రానికి సమర్పించిన ఉమ్మడి వినతిపత్రంలో పేర్కొన్నారు. వివిధ ఆర్థిక పరిశోధనా సంస్థలు అందించే అంచనాల ప్రకారం.. ఏడాదికి రూ.85,000 కోట్ల నుంచి రూ.2 లక్షల కోట్లకు పైగా నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని అందులో చెప్పారు. అయితే ఎస్‌బీఐ నివేదిక అందుకు భిన్నమైన స్వరాన్ని వినిపించింది. అన్ని రాష్ట్రాల్లో కలిపి మొత్తం జీఎస్టీ  ఆదాయం అదనంగా రూ.4.14 లక్షల కోట్లు పెరుగుతుందని అంచనా వేసింది.

ఇదీ చదవండి: ఏఐతో ఉద్యోగాలు పోతాయా?

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)