అదిగో నా కోడలు.. వసంత కృష్ణ ప్రసాద్ ఆఫీస్ వద్ద.. సంచలన వీడియో బయటపెట్టిన జోగి రమేష్
Breaking News
SBI: రూ. 200 లక్షల కోట్ల టర్నోవర్!
Published on Mon, 08/24/2026 - 08:42
న్యూఢిల్లీ: స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) 2030లో 75వ వ్యవస్థాపక దినోత్సవం (ప్లాటినం జూబ్లీ) జరుపుకునే నాటికి మొత్తం వ్యాపారం రూ. 200 లక్షల కోట్లకు చేరుకోవచ్చని బ్యాంక్ చైర్మన్ సీఎస్ శెట్టి చెప్పారు. ప్రస్తుత వృద్ధిని పరిగణనలోకి తీసుకుంటే టర్నోవర్ రెట్టింపయ్యే అవకాశం ఉందన్నారు. ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్యకలాపాల బదిలీ సహా ఇతర అంశాల కోసం పార్లమెంటులో చట్టం ద్వారా 1955 జూలై 1న ఎస్‌బీఐ ఆవిర్భవించింది.
దేశంగా అతిపెద్ద బ్యాంకుగా నిలుస్తున్న ఎస్‌బీఐ మొత్తం వ్యాపారం (మొత్తం రుణాలు, అడ్వాన్సులు) గత ఆర్థిక సంవత్సరం (2025–26) రెండో త్రైమాసికంలో తొలిసారి రూ.100 లక్షల కోట్ల మైలురాయిని దాటింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి క్వార్టర్ నాటికి ఇది రూ.110.01 లక్షల కోట్లకు ఎగబాకింది. కాగా, ప్లాటినం జూబ్లీ నాటికి నిర్దిష్ట టార్గెట్ ఏదీ బ్యాంకు నిర్దేశించుకోలేదని, అయితే, ప్రస్తుత వృద్ధి ప్రకారం చూస్తే టర్నోవర్ రూ.170–180 లక్షల కోట్లుగా ఉండొచ్చని, గరిష్టంగా రూ.200 లక్షల కోట్లను కూడా తాకే చాన్సుందని చెప్పారు. అది మరో కీలక మైలురాయిగా నిలుస్తుందన్నారు.
ఎకానమీతో పాటే...
ఎస్‌బీఐ కార్యకలాపాలు భారత ఎకానమీ పనితీరుతో ముడిపడి ఉన్నాయని శెట్టి పేర్కొన్నారు. ‘మన ఆర్థిక వ్యవస్థ ఏటా 7–8 శాతం మేర గనుక వృద్ధి చెందితే, ఎస్‌బీఐ బ్యాలెన్స్ షీట్ కూడా 11–12 శాతం వార్షిక వృద్ధి రేటును సాధించే సామర్థ్యం ఉంటుంది. అంటే, ప్రతి ఆరేళ్లకు బ్యాలెన్స్ షీట్ రెట్టింపవుతుంది. దీని ప్రకారం చూస్తే 2030 కల్లా ఎస్‌బీఐ మొత్తం బిజినెస్ రూ. 200 లక్షల కోట్లకు చేరవచ్చు‘ అని ఆయన వివరించారు. కస్టమర్లు, ఉద్యోగులు, వాటాదారులు, అలాగే ఆర్‌బీఐతో సహా ప్రభుత్వం, నియంత్రణ సంస్థలు... ఈ నాలుగు పక్షాల ప్రయోజనాలు లేదా అవసరాలను తీర్చేవిధంగా బ్యాంకు కార్యకలాపాలను విస్తరించే లక్ష్యంతో విజన్ 2030పై ఫోకస్ చేస్తున్నామని కూడా ఎస్‌బీఐ చైర్మన్ తెలిపారు.
Tags : 1