Breaking News

జీఎస్‌టీ తగ్గింపుతో వినియోగం జోరు

Published on Wed, 08/20/2025 - 14:02

వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ)లో రెండే పన్ను శ్లాబులతో కూడిన ప్రతిపాదిత సంస్కరణలతో ఆదాయ నష్టం ఏర్పడినప్పటికీ.. అంతిమంగా వినియోగానికి, జీడీపీకి ఊతమిస్తుందని ఎస్‌బీఐ రీసెర్చ్‌ విభాగం అంచనా వేసింది. జీఎస్‌టీ 5, 12, 18, 28 శాతం శ్లాబులు ఉండగా.. 5, 18 శాతంతోపాటు లగ్జరీ, సిన్‌ (పొగాకు తదితర) గూడ్స్‌పై 40 శాతం పన్నును కేంద్ర ఆర్థిక శాఖ ప్రతిపాదించింది. దీనిపై మంత్రుల బృందం అధ్యయనం తర్వాత తుది నిర్ణయం తీసుకోనున్నారు. రేట్ల తగ్గింపు ఫలితంగా ఆదాయం రూ.85,000 కోట్లు తగ్గుతుందని, అదే సమయంలో వినియోగం రూ.1.98 లక్షల కోట్లు పెరుగుతుందని ఎస్‌బీఐ రీసెర్చ్‌ నివేదిక అంచనా వేసింది.

జీడీపీ కూడా 0.6 శాతం పెరుగుతుందని నివేదిక పేర్కొంది. జీఎస్‌టీ ఆరంభంలో సగటు రేటు 14.4 శాతంగా ఉంటే, 2019 సెప్టెంబర్‌ నాటికి 11.6 శాతానికి తగ్గిందని.. అది ఇప్పుడు 9.5 శాతానికి దిగిరావచ్చని తెలిపింది. వినియోగం పెరుగుతుండడం ద్రవ్యోల్బణాన్ని ఎగిసేలా చేయదని వివరించింది. నిత్యావసరాలైన ఆహారం, వస్త్రాలపై 12 శాతం రేటు కాస్తా 5 శాతానికి దిగొస్తుందని.. ఈ విభాగంలో రిటైల్‌ ద్రవ్యోల్బణం 10–15 బేసిస్‌ పాయింట్లు తగ్గుతుందని తెలిపింది. సేవలకు సంబంధించి ద్రవ్యోల్బణం 5–10 బేసిస్‌ పాయింట్లు తగ్గుతుందని అంచనా కట్టింది. దీంతో మొత్తం మీద రిటైల్‌ ద్రవ్యోల్బణం (సీపీఐ) 0.20–0.25 శాతం తగ్గుతుందని తెలిపింది.  

ఇదీ చదవండి: ఆన్‌లైన్‌ గేమింగ్‌ బిల్లుపై కేంద్ర హోం మంత్రికి లేఖ

జీడీపీ 1.6 శాతం పెరగొచ్చు..

బడ్జెట్‌లో కల్పించిన ఆదాయపన్ను ప్రయోజనాలను కూడా పరిగణనలోకి తీసుకుని చూస్తే మొత్తం మీద వినియోగం 5.31 లక్షల కోట్లు పెరుగుతుందని.. దీని ఫలితంగా జీడీపీ వృద్ధి 1.6 శాతం అధికమవుతుందని ఎస్‌బీఐ రీసెర్చ్‌ నివేదిక తెలిపింది.
 

Videos

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)