Breaking News

ఎస్‌బీఐ భళా

Published on Wed, 11/05/2025 - 02:14

మొత్తం బిజినెస్‌ రూ. 100 లక్షల కోట్లను తాకింది. ఆస్తుల రీత్యా ఎస్‌బీఐ ప్రపంచంలో 43వ ర్యాంకులో నిలుస్తోంది. వీటిలో ఎంఎస్‌ఎంఈ విభాగం రూ. 25 లక్షల కోట్లను ఆక్రమిస్తోంది.     – సీఎస్‌ శెట్టి, చైర్మన్, ఎస్‌బీఐ

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌బ్యాంక్‌(ఎస్‌బీఐ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) రెండో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన జూలై– సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 7 శాతం వృద్ధితో రూ. 21,137 కోట్లను తాకింది. యస్‌ బ్యాంక్‌లో వాటా విక్రయం ద్వారా లభించిన రూ. 4,593 కోట్లు ఇందుకు దోహదపడ్డాయి. స్టాండెలోన్‌ నికర లాభం సైతం 10 శాతం ఎగసి రూ. 20,160 కోట్లకు చేరింది.

గతేడాది(2024–25) ఇదే కాలంలో రూ. 18,331 కోట్లు ఆర్జించింది. కాగా.. రుణాల్లో 12.7 శాతం వృద్ధి నేపథ్యంలోనూ నికర వడ్డీ ఆదాయం 3 శాతమే పుంజుకుని రూ. 42,984 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్లు నామమాత్రంగా 0.17 శాతం బలహీనపడి 2.97 శాతాన్ని తాకాయి. అంచనాలకు అనుగుణంగా పూర్తి ఏడాదికి 3 శాతం మార్జిన్లు సాధించనున్నట్లు బ్యాంక్‌ చైర్మన్‌ శెట్టి విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. వడ్డీయేతర ఆదాయం 30 శాతం జంప్‌చేసి రూ. 19,919 కోట్లకు చేరగా.. మొత్తం ఆదాయం రూ. 1,29,141 కోట్ల నుంచి రూ. 1,34,979 కోట్లకు బలపడింది.  

ఫలితాల నేపథ్యంలో ఎస్‌బీఐ షేరు బీఎస్‌ఈలో 0.7% లాభంతో రూ. 957 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ. 959 వద్ద 52 వారాల గరిష్టాన్ని తాకింది.

రుణ నాణ్యత ఓకే 
ప్రస్తుత సమీక్షా కాలంలో ఎస్‌బీఐ స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 2.13 శాతం నుంచి 1.73 శాతానికి తగ్గాయి. నికర ఎన్‌పీఏలు సైతం 0.53 శాతం నుంచి 0.42 శాతానికి దిగివచ్చాయి. ఇవి గత రెండు దశాబ్దాలలోనే కనిష్టమని శెట్టి వెల్లడించారు. అయితే తాజా స్లిప్పేజీలు రూ. 4,754 కోట్లకు పరిమితమైనప్పటికీ.. మొత్తం ప్రొవిజన్లు రూ. 4,505 కోట్ల నుంచి రూ. 5,400 కోట్లకు పెరిగాయి.

ప్రస్తుతం బ్యాంక్‌ బ్రాంచీల సంఖ్య 23,050కు చేరగా.. పూర్తి ఏడాదిలో మరో 500 జత చేసుకోనున్నట్లు శెట్టి తెలియజేశారు. జీఎస్‌టీ రేట్ల సవరణల తదుపరి రుణాలకు ప్రధానంగా ఆటో రంగంలో డిమాండ్‌ భారీగా పుంజుకున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ సెక్యూరిటీలలో రూ. 3.5 లక్షల కోట్ల మిగులు పెట్టుబడులున్నట్లు తెలియజేశారు. వీటికితోడు ఇటీవల సమీకరించిన రూ. 25,000 కోట్ల మూలధనంతో రూ. 12 లక్షల కోట్ల రుణాలు మంజూరు చేసే వీలున్నట్లు వివరించారు. 

#

Tags : 1

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)