Breaking News

బాండ్లతో రూ. 12,500 కోట్ల సమీకరణ 

Published on Fri, 11/28/2025 - 01:27

న్యూఢిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరంలో బాండ్ల ద్వారా రూ. 12,500 కోట్లు సమీకరించనున్నట్లు ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) చైర్మన్‌ సీఎస్‌ శెట్టి తెలిపారు. ఈటీవల క్విప్‌ (క్వాలిఫైడ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ప్లేస్‌మెంట్‌) మార్గంలో జూలైలో రూ. 25,000 కోట్ల ఈక్విటీ క్యాపిటల్‌ సమకూర్చుకున్నామని వివరించారు. ఇది రూ. 12 లక్షల కోట్ల రుణ వృద్ధికి తోడ్పడుతుందని, వచ్చే 5–6 ఏళ్ల పాటు క్యాపిటల్‌ అడెక్వసీ నిష్పత్తిని 15 శాతం స్థాయిలో కొనసాగించేందుకు సరిపోందని ఆయన చెప్పారు. క్విప్‌కి ముందు సైతం తమకు నిధుల సమీకరణ సమస్యేమీ ఉండేది కాదని పేర్కొన్నారు. 

మరోవైపు వచ్చే వారం పరపతి విధాన సమీక్షలో రిజర్వ్‌ బ్యాంక్‌ కీలక పాలసీ రేటును 0.25 శాతం తగ్గించినా ఇబ్బందేమీ లేకుండా తమ నికర వడ్డీ మార్జిన్‌ (నిమ్‌) గైడెన్స్‌ 3 శాతం స్థాయిని సాధించగలమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో వాస్తవ జీడీపీ వృద్ధి 7.5 శాతంగా, పూర్తి ఆర్థిక సంవత్సరానికి 7 శాతంగా ఉంటుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. అధిక వృద్ధి రేటు సాధిస్తున్నప్పుడు కీలక పాలసీ రేట్లను ఎందుకు తగ్గించాల్సి వస్తోందనేది వివరించడమనేది ఆర్‌బీఐకి సవాలుగా ఉండొచ్చని శెట్టి తెలిపారు. అయితే ద్రవ్యోల్బణం నెమ్మదిస్తుండటా న్ని చూస్తే రేట్లను తగ్గించేందుకే అవకాశాలున్నట్లు తెలుస్తోందన్నారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)