Breaking News

ఎస్‌బీఐలో 10 వేల మంది కొత్త ఉద్యోగులు..

Published on Sun, 10/06/2024 - 17:11

దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్‌ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు 10,000 మంది కొత్త ఉద్యోగులను నియమించుకోవాలని యోచిస్తోంది. సాధారణ బ్యాంకింగ్ అవసరాలను తీర్చడానికి, సాంకేతిక సామర్థ్యాలను బలోపేతం చేయడానికి నియామకాలపై దృష్టి పెట్టింది.

"మా వర్క్‌ఫోర్స్‌ను టెక్నాలజీ వైపు అలాగే జనరల్‌ బ్యాంకింగ్ వైపు పటిష్టం చేస్తున్నాం. ఇటీవల ఎంట్రీ లెవల్‌తోపాటు కొంచెం ఉన్నత స్థాయిలో దాదాపు 1,500 మంది టెక్నాలజీ అర్హుల నియామకాలను ప్రకటించాం" అని ఎస్‌బీఐ చైర్మన్ సీఎస్‌ శెట్టి వార్తా సంస్థ పీటీఐకి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.

"మా టెక్నాలజీ రిక్రూట్‌మెంట్ డేటా సైంటిస్ట్‌లు, డేటా ఆర్కిటెక్ట్‌లు, నెట్‌వర్క్ ఆపరేటర్లు మొదలైన ప్రత్యేక ఉద్యోగాలపై ఉంది. టెక్నాలజీ విభాగంలో వివిధ రకాల ఉద్యోగాల కోసం వారిని రిక్రూట్ చేస్తున్నాం. కాబట్టి, మొత్తంగా ప్రస్తుత సంవత్సరంలో 8,000 నుంచి 10,000 మంది అవసరం మాకుంది. ప్రత్యేక విభాగంతోపాటు సాధారణ విభాగంలోనూ ఉద్యోగుల చేరిక ఉంటుంది" అని పేర్కొన్నారు.

ఎస్‌బీఐలో ఈ ఏడాది మార్చి నాటికి మొత్తం సిబ్బంది సంఖ్య 2,32,296. ఇందులో 1,10,116 మంది ఆఫీసర్లు. ఇక బ్యాంక్‌ నెట్‌వర్క్ విస్తరణ విషయానికి వస్తే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా 600 శాఖలను ప్రారంభించాలని ఎస్‌బీఐ యోచిస్తోందని శెట్టి చెప్పారు. ఎస్‌బీఐ 2024 మార్చి నాటికి దేశవ్యాప్తంగా 22,542 శాఖలను కలిగి ఉంది. ఇవి కాకుండా 65,000 ఏటీఎంలు, 85,000 బిజినెస్‌ కరస్పాండెంట​్‌ కేంద్రాలు ఉన్నాయి.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)