ఆర్ధిక సంవత్సరం చివరి నాటికి మరో 500 శాఖలు: నిర్మలా సీతారామన్

Published on Mon, 11/18/2024 - 18:41

భారతదేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన 'స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' (SBI) తన నెట్‌వర్క్‌ను ఎప్పటికప్పుడు విస్తరిస్తూ.. ప్రజలకు చేరువవుతోంది. తాజాగా ఎస్‌బీఐ తన ముంబైలోని ప్రధాన కేంద్రం 100వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది.

ముంబైలో జరిగిన ఎస్‌బీఐ 100వ వార్షికోత్సవంలో పాల్గొన్న కేంద్ర ఆర్థిక మంత్రి 'నిర్మలా సీతారామన్' మాట్లాడుతూ.. 1921లో మూడు ప్రెసిడెన్సీ బ్యాంకులను విలీనం చేసి ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (IBI)గా ఏర్పాటు చేశారు. 1955 సంవత్సరంలో ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మారిందని గుర్తు చేశారు.

ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 22,500 శాఖలను కలిగి ఉంది. ఈ సంఖ్య ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 23వేలుకు చేరుతుందని సీతారామన్ పేర్కొన్నారు. అంటే మరో 500 ఎస్‌బీఐ కొత్త శాఖలు ఏర్పాటు అవుతాయని స్పష్టం చేశారు. 1921లో ఎస్‌బీఐ కేవలం 250 శాఖలను మాత్రమే కలిగి ఉండేది. ప్రస్తుతం ఆ సంఖ్య 90 రెట్లు పెరిగింది.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారతదేశంలో 65,000 ఏటీఎంలను కలిగి ఉంది. ఎస్‌బీఐకు 50 కోట్ల కంటే ఎక్కువ కస్టమర్లు ఉన్నట్లు సమాచారం. దేశంలోని మొత్తం డిపాజిట్లలో ఎస్‌బీఐ వాటా 22.4 శాతంగా ఉంది. అంతే కాకుండా రోజుకు 20 కోట్ల యూపీఐ లావాదేవీలను ఎస్‌బీఐ నిర్వహిస్తోంది. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య కూడా భారీగా పెరుగుతుందని తెలుస్తోంది.

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)