Breaking News

ఎస్‌బీఐ ఖాతాదారులకు అదిరిపోయే వార్త!

Published on Sat, 07/15/2023 - 20:10

SBI home loans processing fees waiver: దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్‌ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)  తాజాగా కస్టమర్లకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది. గృహరుణాలను తీసుకునే ఖాతాదారులకు ఊరటనిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.   గృహ రుణాలపై రాయితీతోపాటు,  50 - 100 శాతం ప్రాసెసింగ్ ఫీజును రద్దు చేసింది.

పరిమిత కాల ఆఫర్‌గా ఈ వెసులు బాటును అందిస్తోంది. ఎస్‌బీఐ హోమ్ లోన్ వెబ్‌సైట్  సమాచారం  ప్రకారం ఆగస్ట్ 31 వరకే హోమ్ లోన్స్‌పై తగ్గింపు ఆఫర్ వర్తిస్తుందని   ఎస్‌బీఐ వెల్లడించింది. (నిజంగా భయంకరమే..! రేణూ దేశాయ్‌ అద్భుతమైన పిక్స్‌ వైరల్‌!)

రెగ్యులర్ హోమ్ లోన్, ఫ్లెక్సిబుల్ హోమ్ లోన్, ఎన్ఆర్ఐ హోమ్ లోన్, నాన్ శాలరీడ్ హోమ్ లోన్, ప్రివైలేజ్ హోమ్ లోన్, అప్నా ఘర్ హోమ్ లోన్ వంటి వాటిపై ఈ తగ్గింపు ప్రయోజనం అందుబాటులో  ఉంటుందనేది గమనార్హం.రాయితీ లేకుండా ప్రాసెసింగ్  ఫీజు మొత్తం రుణంపై 0.35శాతం, జీఎస్‌టీ కలుపుకొని   కనిష్టంగా రూ.2,000 - రూ. 10వేల మధ్య ఉంటుంది.  (వెకేషన్‌లో ఉన్న ఈ నటి ఎవరు, ఆ డ్రెస్‌ ఖరీదు ఎంతో తెలుసా?)

గమనించవలసిన ముఖ్యమైన అంశాలు
♦ హెచ్ఎల్ రీసేల్‌, రడీ టూ మూవ్‌  ప్రాపర్టీలకు  గతంలో సూచించిన రేట్ల కంటే 20 bps అదనపు రాయితీ. అయితే  సిబిల్‌ స్కోర్‌ 700 లేదా  అంతకంటే ఎక్కువ  ఉండాలి.
♦ బిల్డర్ టై అప్ ప్రాజెక్ట్‌లకుపైన పేర్కొన్న సిఫార్సు చేసిన రేట్ల కంటే 5 bps ఎక్కువ తగ్గింపు.
♦  శౌర్య, శౌర్య ఫ్లెక్సీ పై  ప్రతిపాదిత రేట్ల కంటే అదనంగా 10 బేసిస్ పాయింట్ల రాయితీ.

హెచ్ఎల్ అండ్ టాప్ అప్ రుణాలకు ప్రాసెసింగ్ ఫీజులో 50 శాతం తగ్గింపు లభిస్తుంది. దీని ప్రకారం జీఎస్టీ  కాకుండా   రూ. 2 వేల నుంచి గరిష్టంగా రూ. 5 వేల వరకు ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది. దీంతోపాటు 100 శాతం ప్రాసెసింగ్ ఫీజు బెనిఫిట్ కూడా పొందొచ్చు. అలాగే ఇన్‌స్టాల్ హోమ్ టాప్ అప్, రివర్స్ మోర్ట్‌గేజ్, ఈఎంఐ వంటి రుణాలకు ఎలాంటి ప్రాపెసింగ్ ఫీజు మాఫీ బెనిఫిట్ ఉండదు. మ రోవైపు  రుణాలపై వసూలు  చేసే ఎంసీఎల్‌ఆర్‌ను తాజాగా పెంచింది. కాల వ్యవధి ఆధారంగా దీన్ని 8 శాతం నుంచి 8.75 శాతం మధ్య నిర్ణయించిన సంగతి తెలిసిందే.  (కంపెనీ సీఈవో కాదు, అయినా రోజుకు నాలుగు లక్షల జీతం)

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)