Breaking News

ఎస్‌బీఐలైఫ్‌ ఇన్సూరెన్స్‌, కోవిడ్‌–19 క్లెయిములు భారీగా పెరిగాయ్‌

Published on Tue, 07/27/2021 - 08:44

ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ నికర లాభం 43 శాతం క్షీణించి రూ. 220 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 390 కోట్లు ఆర్జించింది. కోవిడ్‌–19 క్లెయిములకు చెల్లింపులు పెరగడం లాభాలను దెబ్బతీసినట్లు కంపెనీ పేర్కొంది. క్యూ1లో 8,956 క్లెయిములు నమోదైనట్లు వెల్లడించింది. ఇవి 2020–21 పూర్తి ఏడాదితో పోలిస్తే దాదాపు 1.3 రెట్లు అధికమని తెలియజేసింది. దీంతో నికర రీఇన్సూరెన్స్‌ రూ. 570 కోట్లుగా నమోదైంది.
 
ప్రీమియంల తీరు 
క్యూ1లో ఎస్‌బీఐ లైఫ్‌ స్థూల రిటెన్‌ ప్రీమియం 10 శాతం పుంజుకుని రూ. 8,380 కోట్లను తాకింది. కొత్త బిజినెస్‌ ప్రీమియం 9 శాతం వృద్ధితో రూ. 3,350 కోట్లకు చేరగా.. వ్యక్తిగత విభాగంలో 37 శాతం అధికంగా రూ. 1,840 కోట్లను తాకింది. కొత్త బిజినెస్‌ విలువ(వీవోఎన్‌బీ) 52 శాతం జంప్‌చేసి రూ. 390 కోట్లయ్యింది. రూ. 1,390 కోట్ల వ్యక్తిగత రేటెడ్‌ ప్రీమియంతో కంపెనీ ప్రయివేట్‌ మార్కెట్‌లో 18.9 శాతం వాటాతో అగ్రస్థానంలో నిలిచినట్లు ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ వివరించింది. నిర్వహణలోని ఆస్తులు 32 శాతం బలపడి రూ. 2.3 లక్షల కోట్లను తాకగా.. కోవిడ్‌ సంబంధ క్లెయిముల కోసం రూ. 440 కోట్ల అదనపు రిజర్వులను ఏర్పాటు చేసింది.  
 

చదవండి:  అదిరిపోయే ఫీచర్లు, మాస్కులోనే మైక్​, స్పీకర్లు ఇంకా

Videos

పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులపై మరో అక్రమ కేసు బనాయింపు

IPL మ్యాచ్ లు ఎలా షూట్ చేస్తారు? తెరవెనుక రహస్యాలు..!

మిస్ వరల్డ్ వివాదం 2025.. పోటీ నుండి తప్పుకున్న బ్రిటిష్ బ్యూటీ.. కారణం అదేనా..!

YSRCP నేతలను చావబాదడమే నా టార్గెట్

కాకాణి గోవర్ధన్ రెడ్డి అరెస్ట్.. రంగంలోకి వైఎస్సార్సీపీ నేతలు

రైతులపై సోలార్ పిడుగు

కరోనా వచ్చినా.. I Don't Care.. నా సభే ముఖ్యం..!

ఇద్దరి ప్రాణాలు తీసిన ఇన్ స్టా పరిచయం

ఆ నలుగురితో నాకు సంబంధం లేదు..!

మూడు రోజులు భారీ వర్షాలు..

Photos

+5

'భైరవం' ప్రీ రిలీజ్ లో ఫ్యామిలీ తో సందడి చేసిన మంచు మనోజ్ (ఫొటోలు)

+5

ఘనంగా కాళేశ్వరం సరస్వతి పురస్కారాలు.. పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

'భైరవం' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

అమ్మ బర్త్‌డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసిన హీరోయిన్‌ లయ.. ఫోటోలు

+5

Miss World 2025 : టాప్‌ మోడల్‌ పోటీలో గెలిచిన సుందరీమణులు (ఫొటోలు)

+5

మతాలు వేరైనా పెళ్లి బంధంతో ఒక్కటైన యాంకర్ డాలీ, కరమ్ అబ్బాస్ (ఫోటోలు)

+5

కేన్స్‌లోని మధుర క్షణాలను పంచుకున్న జాన్వీ కపూర్‌ (ఫోటోలు)

+5

ప్రభాస్‌కి జోడీగా లక్కీఛాన్స్‌ కొట్టేసిన ఈ బ్యూటీ ఫొటోలు చూశారా..? (ఫోటోలు)

+5

900 ఏళ్ల నాటి కోటలో సుకుమార్‌ దంపతులు.. లండన్‌ ప్రిన్సెస్‌తో డిన్నర్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)