Breaking News

మహిళలకు ఎస్‌బీఐ ప్రత్యేక పథకం.. డెబిట్‌ కార్డు

Published on Sat, 03/08/2025 - 09:16

మహిళా ఎంట్రప్రెన్యూర్లకు పూచీకత్తు లేకుండా, తక్కువ వడ్డీ రేటుపై రుణాలు అందించేలా ’అస్మిత’ పథకాన్ని ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బీఐ ప్రవేశపెట్టింది. మహిళల సారథ్యంలోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా యూనిట్లకు డిజిటల్‌ మాధ్యమం ద్వారా వేగవంతంగా, సులభతరంగా రుణ సదుపాయం లభించేందుకు ఇది ఉపయోగపడుతుందని బ్యాంక్‌ చైర్మన్‌ సీఎస్‌ శెట్టి తెలిపారు.

వినియోగ ప్రయోజనాల కోసం రుణాలు తీసుకోవడానికి ఇష్టపడే మహిళలు వ్యాపార రుణాలకు తక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని ట్రాన్స్ యూనియన్ సిబిల్ ప్రకటించిన కొద్ది రోజుల్లోనే ఈ ఆవిష్కరణ జరగడం గమనార్హం. ప్రముఖ క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీ ప్రకారం.. మహిళలు తీసుకున్న రుణాలలో కేవలం 3 శాతం మాత్రమే వ్యాపార ప్రయోజనాల కోసం, 42 శాతం వ్యక్తిగత రుణాలు, కన్జ్యూమర్ డ్యూరబుల్ లోన్స్, హోమ్ ఓనర్షిప్ వంటి పర్సనల్ ఫైనాన్స్ ఉత్పత్తుల కోసం, 38 శాతం బంగారంపై ఉన్నాయి.

మరోవైపు, మహిళల కోసమే ప్రత్యేకంగా రూపొందించిన రూపే ఆధారిత ’నారీ శక్తి’ ప్లాటినం డెబిట్‌ కార్డును కూడా బ్యాంకు ఆవిష్కరించింది. ఇక మరో ప్రభుత్వ రంగ బ్యాంక్‌ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా ప్రవాస భారతీయులలో మహిళల కోసం 'బీవోబీ గ్లోబల్ ఉమెన్ ఎన్ఆర్ఈ అండ్ ఎన్ఆర్ఓ సేవింగ్స్ అకౌంట్' పేరిట ప్రత్యేక ఖాతాను ప్రారంభించింది.

Videos

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)