Breaking News

ఎస్‌బీఐ కస్టమర్లకు షాక్.. భారీగా పెరిగిన వడ్డీ రేట్లు

Published on Fri, 12/15/2023 - 21:01

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI).. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ (MCLR), బేస్ రేటును పెంచుతూ కస్టమర్లకు ఒక్కసారిగా షాక్ ఇచ్చింది. ఈ కథనంలో పెరిగిన వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయి, ఎప్పటి నుంచి అమలులోకి వస్తాయనే వివరాలు తెలుసుకుందాం.

ఎస్‌బీఐ బేస్ రేటు ఇప్పుడు 10.10 శాతం నుంచి 10.25 శాతానికి పెరిగింది. అంటే కొత్త బేస్ రేటు గతం కంటే కూడా 0.15 శాతం పెరిగినట్లు స్పష్టమవుతోంది. పెరిగిన వడ్డీ రేట్లు ఈ రోజు (డిసెంబర్ 15) నుంచే అమలులోకి రానున్నట్లు సమాచారం.

మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ విషయానికి వస్తే.. ఇది 8 శాతం నుంచి 8.55 శాతం వరకు ఉంది. ఓవర్ నైట్ ఎమ్‌సీఎల్ఆర్ రేటు 8.0 శాతం వద్ద ఉంది. ఒక నెల, మూడు నెలల కాలవ్యవధికి 8.15 శాతం నుంచి 8.20 శాతానికి పెరిగింది.

ఇదీ చదవండి: బెడ్ అమ్మబోయి రూ.68 లక్షలు పోగొట్టుకున్న టెకీ.. ఎలా అంటే?

ఆరు నెలలకు 8.45 శాతం నుంచి 8.55 శాతానికి, సంవత్సర కాల వ్యవధికి 8.55 శాతం నుంచి 8.65 శాతానికి, రెండు సంవత్సరాలకు 8.65 శాతం నుంచి 8.75 శాతానికి, మూడు సంవత్సరాల కాల వ్యవధికి 8.75 నుంచి 8.85 శాతానికి పెరిగింది. ఇవన్నీ ఈ రోజు నుంచే అమలులో ఉంటాయి.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)