Breaking News

బ్యాంక్‌ బ్యాలెన్స్‌.. బ్యాడ్‌ న్యూస్‌..

Published on Thu, 06/19/2025 - 21:32

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇటీవల రెపో రేటును 50 బేసిస్ పాయింట్ల తగ్గించింది. దీనికి అనుగుణంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్‌లతో సహా ప్రధాన బ్యాంకులు సేవింగ్స్‌ అకౌంట్‌లోని బ్యాలెన్స్‌పై చెల్లించే వడ్డీ రేట్లను తగ్గించాయి. దీంతో పొదుపు ఖాతాదారులు తక్కువ రాబడిని చూస్తారు. ఈ ఏడాది క్యుములేటివ్ రేటు కోత ఇప్పుడు 1 శాతంగా ఉంది. పలు ప్రైవేటు, ప్రభుత్వ రంగ బ్యాంకులు ఒకే విధమైన తక్కువ రేట్ల విధానానికి మారడంతో డిపాజిటర్లపై ప్రభావం పడుతోంది.

వడ్డీ రేట్లను తగ్గించిన ఎస్‌బీఐ
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్‌ అయిన ఎస్‌బీఐ తన పొదుపు ఖాతా వడ్డీ రేటును జూన్ 15 నుండి అన్ని బ్యాలెన్స్‌లకు సంవత్సరానికి 2.5 శాతానికి సవరించింది. గతంలో రూ.10 కోట్ల లోపు బ్యాలెన్స్‌లపై 2.7 శాతం, రూ.10 కోట్లు అంతకంటే ఎక్కువ బ్యాలెన్స్‌లపై 3 శాతం వడ్డీని ఆఫర్ చేసేది.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తన పొదుపు రేట్లను జూన్ 10 నుండి ఫ్లాట్ 2.75 శాతానికి సర్దుబాటు చేసింది. గతంలో ఇది రూ.50 లక్షల లోపు బ్యాలెన్స్‌లపై 2.75 శాతం, రూ.50 లక్షలు అంతకంటే ఎక్కువ బ్యాలెన్స్‌లపై 3.25 శాతం వడ్డీని ఆఫర్ చేసింది.

ఐసీఐసీఐ బ్యాంక్
ఐసీఐసీఐ బ్యాంక్ కూడా తన వడ్డీ రేటును 2.75 శాతానికి సవరించింది. ఇది జూన్ 12 నుండి వర్తిస్తుంది. గతంలో ఇది రూ.50 లక్షల లోపు బ్యాలెన్స్‌లపై 2.75 శాతం, అంతకంటే ఎక్కువ బ్యాలెన్స్‌లపై 3.25 శాతం వడ్డీని అందించేది.

రాబడి పెంచుకోండి..
యువత బ్యాంక్‌ బ్యాలెన్స్‌పైనే దృష్టి పెట్టకుండా దాన్ని రాబడినిచ్చే పెట్టుబడి మార్గాల వైపు మళ్లించాలని నిపుణులు సూచిస్తున్నారు. పొదుపు ఖాతా మీ డబ్బును సురక్షితంగా ఉంచుతుంది. కానీ ద్రవ్యోల్బణం నెమ్మదిగా దాని విలువను తినేస్తుంది. మరోవైపు, పెట్టుబడి మీ డబ్బును కాంపౌండింగ్ శక్తి ద్వారా కాలక్రమేణా పెంచుతుంది. ఎక్కువ వడ్డీనిచ్చే పొదుపు పథకాలు, మ్యూచువల్ ఫండ్స్, సిప్ లు లేదా స్టాక్స్ లోని ఫ్రాక్షనల్ షేర్లతో చిన్నగా ప్రారంభిం‍చవచ్చు.  పెట్టుబడి పెట్టడానికి మీరు ధనవంతులు కానవసరం లేదు.  మీరు ఎంత త్వరగా ప్రారంభిస్తే, మీ ఆర్థిక పునాది బలంగా మారుతుంది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)