Breaking News

ఎఫ్‌డీ కస్టమర్లకు ఎస్‌బీఐ గుడ్‌ న్యూస్‌! వడ్డీ రేట్లు పెంపు..

Published on Thu, 02/16/2023 - 11:10

దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బాంక్‌ అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) తమ దగ్గర ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు చేసే వారికి ఊరటనిచ్చింది. రూ.2 కోట్లలోపు ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను 5 నుంచి 25 బీపీఎస్‌ వరకు పెంచింది. అలాగే 400 రోజుల నిర్దిష్ట కాలవ్యవధితో కొత్త ఎఫ్‌డీ పథకాన్ని ప్రవేశపెట్టింది.

ఈ పథకానికి 7.10 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. ఇది 2023 మార్చి 31 వరకు చెల్లుబాటులో ఉంటుంది. 7 రోజుల నుంచి 10 సంవత్సరాల కాలవ్యవధి గల ఎఫ్‌డీలపై 3 నుంచి 7 శాతం వరకు వడ్డీని చెల్లిస్తోంది. 2-3 సంవత్సరాల కాలానికి ఎఫ్‌డీ చేసిన సీనియర్‌ సిటిజన్లుకు 7.50 శాతం వడ్డీ లభిస్తుంది. సీనియర్‌ సిటిజన్లకు ఎస్‌బీఐ అందించే అత్యధిక వడ్డీ రేటు ఇదే. పెంచిన ఈ వడ్డీ రేట్లు ఫిబ్రవరి 15 నుంచి అమల్లోకి వచ్చాయి.

ఎస్‌బీఐ 2 నుంచి 3 సంవత్సరాల వ్యవధికి  చేసిన ఎఫ్‌డీలపై  వడ్డీ రేటును అత్యధికంగా 25 బీపీఎస్‌ పెంచింది. వీటిపై గతంలో 6.75 శాతం వడ్డీ వస్తుండగా ఇప్పుడు 7 శాతానికి పెరిగింది. అలాగే 3 నుంచి 10 ఏళ్ల వ్యవధి ఎఫ్‌డీలపైనా 25 బేసిస్‌ పాయింట్లు పెంచింది. వీటికి గతంలో 6.25 శాతం వడ్డీ ఇస్తుండగా తాజాగా 6.5 శాతం అందిస్తోంది. ఇక 1 నుంచి 2 సంవత్సరాల కాలానికి  చేసే ఎఫ్‌డీలపై అత్యల్పంగా కేవలం 5 బేసిస్‌ పాయింట్లు మాత్రమే వడ్డీ రేటు పెంచింది. వీటిపై 6.75 శాతం ఉన్న వడ్డీ రేటు ప్రస్తుతం 6.8 శాతానికి పెరిగింది.

అయితే సంవత్సరం కన్నా తక్కువ కాల వ్యవధి గల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై ఎటువంటి పెంపూ లేదు. 211 రోజుల నుంచి సంవత్సరం లోపు చేసే ఎఫ్‌డీలపై 5.75 శాతం, 180 నుంచి 210 రోజుల లోపు వాటిపై 5.25 శాతం, 46 నుంచి 179 రోజుల వరకు చేసే ఎఫ్‌డీలపై 4.5 శాతం, 7 నుంచి 45 రోజులలోపు వాటిపై 3 శాతం వడ్డీ రేటును ఎస్‌బీఐ అలాగే కొనసాగిస్తోంది.

(ఇదీ చదవండి: సీనియర్‌ సిటిజన్స్‌ కోసం కొత్త పాలసీ.. ప్రయోజనాలు ఇవే..)

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)