Breaking News

ఎస్‌బీఐకి మొట్టికాయలు గట్టిగానే పడ్డాయిగా?

Published on Sun, 05/19/2024 - 18:25

ఎస్‌బీఐకి కన్జ్యూమర్‌ కోర్టు మొట్టి కాయలు వేసింది. కస్టమర్‌ మోసపోయిన రూ.80వేల నగదును వెంటనే బ్యాంక్‌ చెల్లించాలని, లేదంటే కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఆదేశాలు జారీ చేసింది.

జూలై 4, 2015న ఉత్తరాఖండ్‌ రాష్ట్రం రూర్కి నగర నివాసీ పార్థసారథి ముఖర్జీ ఎస్‌బీఐ బ్యాంక్‌ అకౌంట్‌ నుంచి నేరస్తులు న్యూఢిల్లీలోని ఎస్‌బీఐ బ్యాంక్‌ ఏటీఎంల నుంచి రూ.80,000 విత్‌డ్రా చేశారు. విత్‌ డ్రా అయినట్లు ముఖర్జీ ఫోన్‌కు మెసేజ్‌ వెళ్లింది. వెంటనే సదరు బ్యాంక్‌కు మెయిల్‌ పంపాడు. గుర్తుతెలియని వ్యక‍్తులు ఎస్‌బీఐ ఏటీఎం నుంచి ఒక్కొక్కరు రూ.10వేలు చొప్పున మొత్తం ఎనిమిది సార్లు విత్ డ్రా చేసినట్లు మెయిల్‌ ద్వారా సమాచారం అందించారు.  

తనకు న‍్యాయం చేయాలని కోరారు. వెంటనే ఉత్తరాఖండ్ కన్జ్యూమర్‌ కోర్టునూ ఆశ్రయించారు. బాధితుడి ఫిర్యాదుతో కన్జ్యూమర్‌ కోర్టు సమస్యను పరిష్కరించి, బాధితుడికి న్యాయం చేయాలని ఢిల్లీ ఎస్‌బీఐకు ఉత్తర్వులు జారీ చేసింది.

కోర్టు ఆదేశాలతో స్థానిక పోలీసులు విచారణ చేపట్టేందుకు ఎస్‌బీఐ బ్యాంక్‌ను సీసీటీవీ పుటేజీ ఇవ్వాలని కోరారు. అందుకు ఎస్‌బీఐ అధికారులు తిరస్కరించారు. ఎస్‌బీఐ అధికారుల తీరుపై బాధితుడు కన్జ్యూమర్‌ కోర్టుకు తన గోడును వెళ్లబోసుకున్నాడు.  

అయితే, అగంతకులు విత్‌ డ్రాపై బ్యాంక్‌ సత్వరమే చర్యలు తీసుకుందని, తన బ్యాంక్‌ బ్రాంచ్‌తో పాటు ఇతర బ్యాంక్‌ బ్రాంచీలకు సమాచారం ఇచ్చామని బ్యాంక్‌ అధికారులు కన్జ్యూమర్‌ కోర్టుకు తెలిపారు. 

తమ (ఎస్‌బీఐ) సేవల్లో ఎలాంటి లోపాలు లేవని, బ్యాంక్‌ ఖాతాదారుడు అగంతకులకు కార్డ్‌ వివరాలు, బ్యాంక్‌ డీటెయిల్స్‌ అందించారని స్పష్టం చేసింది. ఎస్‌బీఐ బ్యాంక్‌ తీరును ప్రశ్నించిన కన్జ్యూమర్‌ కోర్టు బాధితుడు నష్టపోయిన రూ.80వేల మొత్తాన్ని చెల్లించాలని సూచించింది.

వివాదాస్పద లావాదేవీలకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ లేకపోవడంతో పోలీసు విచారణను ముగించలేమని రాష్ట్ర కమిషన్ గమనించింది. రికార్డులో ఉన్న సాక్ష్యాధారాల ఆధారంగా బ్యాంక్‌ సేవల్లో లోపాలు ఉన్నాయని భావించామనే, కాబట్టే ఈ తీర్పు ఇచ్చినట్లు ఉత్తరా ఖండ్‌ కన్జ్యూమర్‌ కోర్టు వెల్లడించింది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)