ఎస్‌బీఐ కొత్త ప్రతిపాదన.. ఇలా చేయొచ్చు!

Published on Wed, 11/19/2025 - 13:42

మోసాలను కట్టడి చేసే దిశగా ఫైనాన్షియల్‌ వ్యవస్థలోని అన్ని భాగాలను అనుసంధానం చేసేలా జాతీయ ఫైనాన్షియల్‌ గ్రిడ్‌ను ఏర్పాటు చేయొచ్చని ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బీఐ చైర్మన్‌ చల్లా శ్రీనివాసులు శెట్టి ప్రతిపాదించారు. ఇందులో క్రెడిట్‌ బ్యూరోలు, ఫ్రాడ్‌ రిజిస్ట్రీలు, ఈకేవైసీ సదుపాయాలు, ఏకీకృత చెల్లింపుల ప్లాట్‌ఫాం, అకౌంట్‌ అగ్రిగేటర్లు మొదలైన వర్గాలు ఉండొచ్చని చెప్పారు.

సీఐఐ ఫైనాన్సింగ్‌ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. ఆర్థిక రంగ సంస్థలన్నీ కలిసి ఇండియన్‌ డిజిటల్‌ పేమెంట్‌ ఇంటెలిజెన్స్‌ కార్పొరేషన్‌ పేరిట లాభాపేక్షరహిత సంస్థను ఏర్పాటు చేయొచ్చని శెట్టి చెప్పారు. కస్టమర్ల ప్రయోజనాలను పరిరక్షించే విధంగా పరిశ్రమ భాగస్వాములకు రియల్‌టైమ్‌లో డేటాను అందించగలిగే ఉమ్మడి డిజిటల్‌ మౌలిక సదుపాయంగా ఇది ఉండాలని పేర్కొన్నారు.

మరోవైపు, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో టెక్నాలజీ వ్యవస్థను సమీక్షించాలని యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఎండీ ఆశీష్‌ పాండే చెప్పారు. ఉద్యోగులకు నైపుణ్యాల్లో శిక్షణనివ్వడం మొదలైనవి పరిశ్రమకు కీలక సవాళ్లుగా ఉంటున్నాయని పేర్కొన్నారు.

Videos

KSR: అన్నదాతకు బాబు షాక్ జగన్‌పై దుష్ప్రచారం

జగన్ రాకతో.. దద్దరిల్లిన హైదరాబాద్

బెంగళూరు హైవేపై మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు యాక్సిడెంట్

అన్మోల్ బిష్ణోయ్ అరెస్ట్.. కేంద్రం స్ట్రాంగ్ వార్నింగ్

హైదరాబాద్ లో జగన్ క్రేజ్..

KTRకు బిగ్ షాక్.. CBI చేతికి ఫార్ములా ఈ-రేసు కేసు

Watch Live: CBI కోర్టుకు YS జగన్

ఆగకుండా 5000 KMs.. ఐదు రోజుల్లో పరిగెత్తిన గద్దలు

నేడు CBI కోర్టుకు YS జగన్.. కేసుల నుంచి తప్పించుకునేందుకు బాబు తప్పుడు ప్రచారం

ఒకటి పోతే మరొకటి.. ఆన్ లైన్ లో మరో ఐబొమ్మ

Photos

+5

హైదరాబాద్‌కు జగన్‌.. పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమా ప్రీ రిలీజ్ (ఫొటోలు)

+5

విశాఖ : కన్నుల పండుగగా అనంత పద్మనాభుని దీపోత్సవం (ఫొటోలు)

+5

నాగ‌దుర్గ‌ హీరోయిన్‌గా తొలి చిత్రం..‘కలివి వనం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

పుట్టపర్తిలో సత్యసాయి బాబా శతజయంతి వేడుకలు (ఫొటోలు)

+5

తెలుసు కదా మూవీ సెట్‌లో సరదా సరదాగా కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి (ఫోటోలు)

+5

శ్రీశైలంలో సురేఖవాణి కూతురు సుప్రీత ప్రత్యేక పూజలు (ఫోటోలు)

+5

సినిమా పైరసీపై ఫిల్మ్‌ ఛాంబర్‌ మహా ధర్నా (ఫోటోలు)

+5

జీన్స్ డ్రెస్సులో మెరుస్తున్న అక్కినేని కోడలు శోభిత (ఫోటోలు)

+5

ప్రెగ్నెన్సీతో బిగ్‌బాస్ సోనియా.. లేటేస్ట్‌ బేబీ బంప్‌ ఫోటోలు చూశారా?