Breaking News

నిరాశపరిచిన ఎస్‌బీఐ కార్డ్‌

Published on Sun, 04/27/2025 - 11:42

న్యూఢిల్లీ: ఎస్‌బీఐ కార్డ్‌ (క్రెడిట్‌ కార్డు సేవల్లోని) గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికి (2025 జనవరి–మార్చి) రూ.534 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో లాభం రూ.662 కోట్లతో పోల్చి చూస్తే 19 శాతం తగ్గిపోయింది. క్రెడిట్‌ కార్డులపై రుణ ఎగవేతలు పెరగడం లాభాలకు గండికొట్టింది. మొత్తం ఆదాయం మాత్రం ఇదే కాలంలో రూ.4,475 కోట్ల నుంచి రూ.4,832 కోట్లకు వృద్ధి చెందింది. వడ్డీ ఆదాయం రూ.2,415 కోట్లకు మెరుగుపడింది.

క్రితం ఏడాది ఇదే కాలంలో ఇది రూ.2,139 కోట్లుగా ఉంది. స్థూల నిరర్థక రుణాలు (వసూలు కాని/ఎన్‌పీఏలు) మొత్తం రుణాల్లో 3.08 శాతంగా ఉన్నాయి. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఇవి 2.76 శాతమే. నికర ఎన్‌పీఏలు గమనించినా.. 0.99 శాతం నుంచి 1.46 శాతానికి పెరిగాయి. నష్టాలు/మొండి బకాయిలకు కేటాయింపులు క్రితం ఏడాది ఇదే కాలంలో రూ.944 కోట్లుగా ఉంటే, సమీక్షా కాలంలో రూ.1,245 కోట్లకు పెరిగిపోయాయి.

ఇక 2024–25 పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఎస్‌బీఐ కార్డ్‌ రూ.1,916 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. 2023–24లో నమోదైన రూ.2,408 కోట్లతో పోల్చి చూస్తే 20 శాతం క్షీణించింది. మొత్తం ఆదాయం మాత్రం రూ.17,484 కోట్ల నుంచి రూ.18,637 కోట్లకు వృద్ధి చెందింది. బ్యాలన్స్‌ షీట్‌ విలువ రూ.58,171 కోట్ల నుంచి రూ.65,546 కోట్లకు పెరిగింది. ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో ఎస్‌బీఐ కార్డ్స్‌ అండ్‌ పేమెంట్‌ సర్వీసెస్‌ షేరు ధర ఒక శాతానికి పైగా లాభపడి రూ.927 వద్ద ముగిసింది.

Videos

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి