Breaking News

ఎస్‌బీఐ-అపోలో కొత్త క్రెడిట్‌ కార్డు.. బెనిఫిట్స్‌ ఇవే..

Published on Sun, 05/18/2025 - 08:00

న్యూఢిల్లీ: ప్రముఖ క్రెడిట్‌ కార్డుల జారీ సంస్థ ఎస్‌బీఐ కార్డ్, దిగ్గజ రిటైల్‌ ఫార్మసీ చెయిన్‌ అపోలో హెల్త్‌కో కీలక భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. ఇందులో భాగంగా అపోలో ఎస్‌బీఐ కార్డ్‌ సెలెక్ట్‌ కార్డ్‌ను ఆవిష్కరించాయి. ఈ కార్డ్‌ ద్వారా అపోలో ఫార్మసీతో పాటు అపోలో 24/7 యాప్‌లో ఆకర్షణీయమైన ఆఫర్లు పొందవచ్చు. ఫార్మసీ ఉత్పత్తులు, ఆరోగ్య పరీక్షలు, ఇతర పలు రకాల సేవలకు చెల్లింపులు చేయొచ్చు.

అపోలో ఎస్‌బీఐ సెలెక్ట్‌ క్రెడిట్‌ కార్డును రూపే, మాస్టర్‌కార్డ్‌ ప్లాట్‌ఫామ్స్‌పై తీసుకొచ్చారు. ఈ కార్డ్‌ ద్వారా ఎంపిక చేసిన హెల్త్‌, వెల్‌నెస్‌ ఉత్పత్తుల కొనుగోలుపై 25 శాతం వరకూ ఆదా చేసుకోవచ్చు. అలాగే అపోలో 24|7 యాప్‌, రిటైల్‌ స్టోర్లలో కొనుగోలుపై రివార్డ్స్‌ పాయింట్స్‌గా 10 శాతం, హెల్త్‌ క్రెడిట్స్‌ రూపంలో 15 శాతం వరకూ తిరిగి పొందవచ్చు. అలాగే  వెల్‌కమ్‌ గిఫ్ట్‌ కింద రూ.1,500 విలువ చేసే ఇ–గిఫ్ట్‌ వోచర్‌ లభిస్తుంది.

అపోలో 24|7 యాప్‌, ఎస్‌బీఐ కార్డ్‌ వెబ్‌సైట్‌లలో డిజిటల్‌గా ఈ అపోలో ఎస్‌బీఐ సెలెక్ట్‌ క్రెడిట్‌ కార్డును పొందవచ్చు. అలాగే కొన్ని ఎంపిక చేసిన అపోలో ఫార్మసీ స్టోర్లలో వ్యక్తిగతంగానూ వీటిని తీసుకోవచ్చు. ఈ కార్డ్‌ వార్షిక ఫీజు రూ.1499. దీనికి ట్యాక్స్‌లు అదనం.సంవత్సరానికి రూ.3 లక్షలకు మించి ఖర్చు చేస్తే వార్షిక ఫీజు మినహాయింపు పొందవచ్చు.

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)