Breaking News

ఆ మైలురాయి సాధించడమే ఎస్‌బీఐ లక్ష్యం

Published on Wed, 09/25/2024 - 21:28

వచ్చే 3-5 సంవత్సరాలలో రూ. 1 లక్ష కోట్ల నికర లాభం మైలురాయిని దాటిన మొదటి భారతీయ ఆర్థిక సంస్థగా అవతరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) చైర్మన్‌ సీఎస్‌ శెట్టి పేర్కొన్నారు. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు విషయాలు వెల్లడించారు.

2024 ఆర్థిక సంవత్సరంలో ఎస్‌బీఐ 21.59 శాతం వృద్ధితో రూ.61,077 కోట్ల స్టాండలోన్ నికర లాభాన్ని నమోదు చేసింది. వచ్చే 3-5 సంవత్సరాలలో రూ. 1 లక్ష కోట్లు దాటడం సాధ్యమేనా అని అడిగినప్పుడు “మాకు అవకాశం ఉంది. ఖచ్చితంగా, ఆ మైలురాయిని చేరుకున్న దేశంలో మొదటి కంపెనీగా మేము ఉండాలనుకుంటున్నాం” అని సీఎస్‌ శెట్టి చెప్పారు.

లాభాలు, మార్కెట్ క్యాపిటలైజేషన్ మొదలైనవి తమకు చాలా ముఖ్యమైన అంశాలని, అదే సమయంలో కస్టమర్-సెంట్రిసిటీకి సమానమైన ప్రాధాన్యతనిస్తామని ఆయన పేర్కొన్నారు. అదే తమ కార్యకలాపాలలో ప్రాథమిక అంశంగా ఉంటుందని కూడా ఆయన చెప్పుకొచ్చారు.

ఇక కార్పొరేట్ రుణ డిమాండ్‌కు సంబంధించి ప్రభుత్వ, ప్రైవేటు రంగాల నుండి  బ్యాంక్ ఇప్పటికే రూ. 4 లక్షల కోట్ల బలమైన క్రెడిట్ పైప్‌లైన్‌ను పొందిందని వివరించారు. ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో ప్రైవేట్ రంగం మూలధన వ్యయం పెరుగుతుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)