Breaking News

మరో కీలక పరిణామం, ‘ఓపెన్‌ఏఐ’లోకే శామ్‌ ఆల్ట్‌మన్‌?

Published on Tue, 11/21/2023 - 10:07

ప్రముఖ ఏఐ సంస్థ ఓపెన్‌ఏఐలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మైక్రోసాఫ్ట్‌ ఏఐ విభాగంలో పనిచేయడం కంటే శామ్‌ ఆల్ట్‌మన్‌ ఓపెన్‌ఏఐకి వెళ్లడమే మంచిదన్న అభిప్రాయం వ్యక్తం చేశారు మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్యనాదెళ్ల  

ఓపెన్‌ఏఐ మాజీ సీఈఓ శామ్‌ ఆల్ట్‌మన్‌ని తొలగించడం.. ఆ తర్వాత ఆయన భవితవ్యంపై మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్యనాదెళ్ల  బ్లూమ్‌బెర్గ్ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘ఓపెన్‌ఏఐలో ఆల్ట్‌మన్ ఎలాంటి తప్పు చేయలేదని చెప్పారు. నేను అతనిమీద, అతని నాయకత్వం, సామర్థ్యంపై నమ్మకంగా ఉన్నాను. కాబట్టే మేం అతనిని మైక్రోసాఫ్ట్‌లోకి స్వాగతించాలనుకుంటున్నాము’ అని సత్యనాదెళ్ల ఇంటర్వ్యూలో చెప్పారు. 

ఆల్ట్‌మన్‌ తమ కంపెనీ కొత్త ఏఐ రీసెర్చ్‌ బృందంలో చేరనున్నారని వెల్లడించారు. ఆయనతో పాటు ఓపెన్‌ఏఐ నుంచి బయటకు వచ్చిన గ్రెగ్‌ బ్రాక్‌మన్‌ సైతం మైక్రోసాఫ్ట్‌తో కలిసి పనిచేయనున్నట్లు తెలిపారు.


అయితే,  ఓపెన్‌ఏఐలోని పెట్టుబడి దారులు శామ్‌ ఆల్ట్‌మన్‌ని సంస్థలోకి తీసుకోవాలని బోర్డ్‌ సభ్యులపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ తరుణంలో శామ్‌ ఆల్ట్‌మన్‌ మైక్రోసాఫ్ట్‌లో చేరడం కంటే, తిరిగి ఓపెన్‌ఏఐకి వెళితే బాగుండేదన్న సంకేతాలిచ్చారు సత్యనాదెళ్ల. మరి ఈ వరుస పరిణామాలు ఎటు దారి తీస్తాయో చూడాల్సి ఉంది. 

చదవండి👉సంచలనం.. రాజీనామాలో 500 మంది ఉద్యోగులు, ఓపెన్‌ఏఐకి ఎదురు దెబ్బ!

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)