Breaking News

శామ్‌సంగ్ ట్రై ఫోల్డ్ ఫోన్‌: వివరాలు లీక్..

Published on Tue, 02/25/2025 - 21:14

ఇప్పటి వరకు ఫోల్డబుల్ ఫోన్స్ వచ్చాయి. ఇకపై ట్రై-ఫోల్డ్ ఫోన్‌లు మార్కెట్లోకి రానున్నాయి. శామ్‌సంగ్ కంపెనీ ఈ రకమైన ఫోన్‌లను లాంచ్ చేయడానికి సిద్ధమైంది. సంస్థ దీనికి 'గెలాక్సీ జీ ఫోల్డ్' అని పేరు పెట్టనున్నట్లు సమాచారం. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

ఇప్పటి వరకు గ్లోబల్ మార్కెట్లో ఉన్న ఒకే ఒక్క ట్రై-ఫోల్డ్ ఫోన్‌ 'హువావే మేట్ ఎక్స్‌టి'. కాగా దీనికి శామ్‌సంగ్ గెలాక్సీ జీ ఫోల్డ్ ప్రత్యర్థిగా నిలువనుంది. దీనిని కంపెనీ ఏప్రిల్ 2025లో లాంచ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇది శామ్‌సంగ్ జెడ్ ఫోల్డ్ 7, గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 7లతో పాటు గెలాక్సీ అన్‌ప్యాక్డ్‌ ఈవెంట్‌లో లాంచ్ అవుతుందని చెబుతున్నారు.

కొత్త శామ్‌సంగ్ గెలాక్సీ జి ఫోల్డ్ మొబైల్.. హువావే మేట్ XT కంటే భిన్నంగా ఉంటుందని తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.49 ఇంచెస్ కవర్ డిస్‌ప్లే, 9.96 ఇంచెస్ మెయిన్ ఫోల్డబుల్ డిస్‌ప్లే ఉండవచ్చు. ఈ కొలతలు మేట్ ఎక్స్‌టి కంటే చాలా భిన్నంగా ఉంటాయి. ఎందుకంటే ఇది పరిమాణంలో కొంచెం పెద్దది. లాంచ్ అయినప్పటికీ, గెలాక్సీ జి ఫోల్డ్ లాంచ్ అయిన వెంటనే అమ్మకానికి రాకపోవచ్చు. గెలాక్సీ ఫోల్డ్ స్పెషల్ ఎడిషన్‌గా మాత్రమే పరిమిత సంఖ్యలో మాత్రమే లభించే అవకాశం ఉంది.

శామ్‌సంగ్ ఈ గెలాక్సీ జి ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్ కోసం ఎస్ పెన్ అందించనుంది. పెరుగుతున్న ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌తో పోటీ పడటానికి శామ్‌సంగ్ ఈ ఫోన్ తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఫోన్ ధరలు, లాంచ్ డేట్ వివరాలు వంటివి అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.

ఇదీ చదవండి: పెళ్లి చేసుకుంటారా?.. ఉద్యోగం వదులుకుంటారా?: కంపెనీ వార్నింగ్

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు