Breaking News

సరికొత్త మడత ఫోన్లు.. అదిరిపోయే ఫీచర్లు!

Published on Thu, 07/11/2024 - 19:10

శాంసంగ్‌ తన సరికొత్త ఫోల్డబుల్‌ ఫోన్లను ప్రకటించింది. గెలాక్సి జెడ్‌ ఫోల్డ్‌6 (Galaxy Z Fold6), గెలాక్సి జెడ్‌ ఫ్లిప్‌6 (Galaxy Z Flip6)లను  ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసింది. భారత్‌లో వీటి ధరలను ప్రకటించిన కంపెనీ ముందస్తు ఆర్డర్‌లను ప్రారంభించింది.

గెలాక్సి జెడ్‌ ఫ్లిప్‌6 (12GB+256GB) ధర రూ. 1,09,999 కాగా 12GB+512GB వెర్షన్ ధర రూ. 1,21,999. ఇక 12GB+256GB వేరియంట్‌లోని గెలాక్సి జెడ్‌ ఫోల్డ్‌6 ధర రూ.1,64,999 కాగా, 12GB+512GB వెర్షన్ రూ.1,76,999కి వస్తుంది. 12GB+1TB (సిల్వర్ షాడో కలర్) ధర రూ. 2,00,999 అని కంపెనీ తెలిపింది.

"డివైస్‌లను ప్రీ-ఆర్డర్ చేసే వారు రూ. 14,999 విలువ చేసే 'గెలాక్సీ జెడ్ అస్యూరెన్స్'లో భాగంగా రెండు స్క్రీన్‌లు, విడిభాగాలను కేవలం రూ. 999కి పొందుతారు" అని కంపెనీ తెలిపింది, ప్రస్తుత శాంసంగ్ ఫ్లాగ్‌షిప్ కస్టమర్‌లు రూ. 15,000 అప్‌గ్రేడ్ బోనస్‌ను పొందవచ్చని కంపెనీ పేర్కొంది.

గెలాక్సి జెడ్‌ ఫోల్డ్‌6, గెలాక్సి జెడ్‌ ఫ్లిప్‌6 ఫోల్డబుల్‌ ఫోన్లతో పాటు గెలాక్సి బడ్స్‌3 (Galaxy Buds3), గెలాక్సి బడ్స్3 ప్రో (Galaxy Buds3 Pro)లను కూడా శాంసంగ్‌ లాంచ్‌ చేసింది. వీటిలో బడ్స్3 ధర రూ. 14,999 కాగా బడ్స్3 ప్రో ధర రూ. 19,999. శాంసంగ్‌ గెలాక్సి ఫోల్డబుల్‌ ఫోన్లు, బడ్స్‌ అమ్మకాలు జూలై 24 నుంచి ప్రారంభం కానున్నాయి.

గెలాక్సి జెడ్‌ ఫోల్డ్‌6 స్పెసిఫికేషన్లు
» 7.60-అంగుళాల ప్రైమరీ డిస్‌ప్లే
» స్నాప్‌డ్రాగన్ 8 జెన్‌ 3 ప్రాసెసర్
» 10-మెగాపిక్సెల్ + 4-మెగాపిక్సెల్ ఫ్రంట్‌ కెమెరా
» 50-మెగాపిక్సెల్ + 12-మెగాపిక్సెల్ + 10-మెగాపిక్సెల్ రియర్‌ కెమెరా
» 12GB ర్యామ్‌, 256GB, 512GB, 1TB స్టోరేజ్‌
» 4400mAh బ్యాటరీ కెపాసిటీ
» ఆండ్రాయిడ్ 14 ఓఎస్‌

గెలాక్సి జెడ్‌ ఫ్లిప్‌6 స్పెసిఫికేషన్లు
» 6.70-అంగుళాల ప్రైమరీ డిస్‌ప్లే
» స్నాప్‌డ్రాగన్ 8 జెన్‌ 3 ప్రాసెసర్
» 10-మెగాపిక్సెల్ ఫ్రంట్‌ కెమెరా
» 50-మెగాపిక్సెల్ + 12-మెగాపిక్సెల్ రియర్‌ కెమెరా
» 12GB ర్యామ్‌, 256GB, 512GB స్టోరేజ్‌
» 4000mAh బ్యాటరీ కెపాసిటీ
» ఆండ్రాయిడ్ 14 ఓఎస్‌

Videos

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు