Breaking News

48 గంటల్లో 2 లక్షలకుపైగా ఆర్డర్లు..

Published on Sun, 07/20/2025 - 13:16

కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ తన సెవెంత్జనరేషన్ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్ సిరీస్కోసం భారత్లో లాంచ్ అయిన 48 గంటల్లోనే 2.1 లక్షల ప్రీ-ఆర్డర్లు వచ్చినట్లు తెలిపింది. శాంసంగ్ ఏడో తరం ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్ సిరీస్లో భాగంగా గెలాక్సీ జెడ్ ఫోల్డ్7, గెలాక్సీ జెడ్ ఫ్లిప్7, గెలాక్సీ జెడ్ ఫ్లిప్7 ఎఫ్ఈ స్మార్ట్ఫోన్లు జూలై 9న భారత్లో లాంచ్ అయ్యాయి.

ఇంత భారీ సంఖ్యలో ప్రీ-ఆర్డర్లు రావడం "బ్రాండ్ ఏడవ తరం ఫోల్డబుల్ కోసం వినియోగదారుల్లో భారీ డిమాండ్, ఉత్సాహాన్ని" సూచిస్తున్నాయని శాంసంగ్ తెలిపింది. ఈ ఏడాది ప్రారంభంలో గెలాక్సీ ఎస్ 25 సిరీస్ కోసం వచ్చిన ప్రీ-ఆర్డర్లకు ఇది దాదాపు సమానం అని శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ ఒక ప్రకటనలో తెలిపింది.

శాంసంగ్ తన స్మార్ట్ ఫోన్ గెలాక్సీ ఎస్ 25 లాంచ్ అయిన మూడు వారాల వ్యవధిలో రికార్డు స్థాయిలో 4.3 లక్షల ప్రీ-ఆర్డర్లను అందుకుంది. మొదటి 48 గంటల్లో, ఎస్ 25, ఫోల్డ్ 7 / ఫ్లిప్ 7 కోసం ప్రీ-ఆర్డర్ల సంఖ్య దాదాపు సమానంగా ఉంటుంది. ఈ మేడ్ ఇన్ ఇండియా ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ల ధర రూ.89,000 నుంచి రూ.2.11 లక్షల మధ్యలో ఉంది.

గెలాక్సీ జెడ్ ఫోల్డ్7 ధర రూ.1.75 లక్షల నుంచి ప్రారంభమై రూ.2.11 లక్షల వరకు ఉంది. గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 7 ధర రూ.1.10 లక్షల నుంచి రూ.1.22 లక్షల మధ్యలో ఉంది. గెలాక్సీ జెడ్ ఫ్లిప్7 ఎఫ్ఈ ధర రూ.89,000 నుంచి రూ.95,999 వరకు ఉంది. భారత మార్కెట్లో శాంసంగ్ సూపర్ ప్రీమియం కేటగిరీలో అమెరికాకు చెందిన ఫోన్ల తయారీ సంస్థ యాపిల్ తో పోటీ పడుతోంది.

ఐడీసీ ప్రకారం, భారత స్మార్ట్ఫోన్ మార్కెట్లో వివో ముందంజలో ఉంది. ఇది 2025 తొలి త్రైమాసికంలో 19.7 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. ఆ తర్వాత శాంసంగ్ 16.4 శాతం ఎగుమతులతో రెండో స్థానంలో ఉంది.

Videos

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు