Breaking News

శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్లపై బంపరాఫర్!

Published on Mon, 08/03/2026 - 20:45

ఇండియన్ మార్కెట్లో ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్లకు కూడా మంచి డిమాండ్ ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని శాంసంగ్ దేశీయ విఫణిలో ఇలా విభాగంలో ఫోన్స్ లాంచ్ చేసింది. ఇప్పుడు గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 8, జెడ్ ఫోల్డ్ 8 అల్ట్రా, జెడ్ ఫ్లిప్ 8 ఫోన్లను కొనుగోలు చేసే వారికి కంపెనీ 30 నెలల నో-కాస్ట్ ఈఎంఐ సదుపాయాన్ని ప్రకటించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

శాంసంగ్ అందిస్తున్న ఈ 30 నెలల నో-కాస్ట్ ఈఎంఐ సదుపాయంతో.. ఒకేసారి భారీ మొత్తం చెల్లించకుండా, నెలవారీ వాయిదాల రూపంలో డబ్బు చెల్లిస్తూ ఈ ప్రీమియం ఫోన్స్ సొంతం చేసుకోవచ్చు. ఈ ఆఫర్ ముఖ్య ఉద్దేశం గెలాక్సీ జెడ్ సిరీస్ ఫోన్లను మరింత మంది వినియోగదారులకు చేరువ చేయడమే అని సంస్థ తెలిపింది.

గెలాక్సీ AI ఫీచర్లతో వచ్చే ఈ కొత్త ఫోల్డబుల్ ఫోన్లను జీరో డౌన్ పేమెంట్‌తో కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ ఈఎంఐ ఆఫర్‌లో గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 8 అల్ట్రాను నెలకు రూ.6,667 చెల్లిస్తూ సొంతం చేసుకోవచ్చు. ఇక గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 8 కోసం నెలకు రూ.6,000, గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 8 కోసం నెలకు రూ.4,167 ఈఎంఐ సదుపాయంతో కొనుగోలు చేయవచ్చు.

ఈ 30 నెలల నో-కాస్ట్ EMI సదుపాయం శాంసంగ్ ఫైనాన్స్ ప్లస్, టీవీఎస్ క్రెడిట్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, పూనావాలా ఫిన్‌కార్ప్ ద్వారా అందుబాటులో ఉంది. శాంసంగ్.కామ్, శాంసంగ్ ఎక్స్‌పీరియన్స్ స్టోర్‌లు, భాగస్వామ్య రిటైల్ అవుట్‌లెట్‌ల ద్వారా కూడా పొందవచ్చు.

గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 8 అల్ట్రా ధర రూ.1,99,999 నుంచి ప్రారంభమవుతుంది. ఇది వైలెట్ షాడో, గ్రాఫైట్, క్రీమ్, గ్రీన్ షాడో  రంగుల్లో లభిస్తుంది. గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 8 ధర రూ.1,79,999 నుంచి ప్రారంభమవుతుండగా, జెడ్ ఫ్లిప్ 8 ధర రూ.1,24,999 నుంచి మొదలవుతుంది. ఈ రెండు మోడళ్లలో కూడా పలు కలర్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.

#

Tags : 1

Videos

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)