Breaking News

శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌26 సిరీస్‌: ధరలు ఇలా

Published on Fri, 02/27/2026 - 15:35

దక్షిణ కొరియన్‌ ఎలక్ట్రానిక్స్‌ దిగ్గజం శాంసంగ్‌ తమ ఫ్లాగ్‌షిప్‌ గెలాక్సీ ఎస్‌26 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్లను ఆవిష్కరించింది. వీటిలో ఎస్‌26, ఎస్‌26ప్లస్, ఎస్‌ 26 అల్ట్రా అని మూడు వేరియంట్స్‌ ఉంటాయి. శాంసంగ్‌ పోర్టల్‌ ప్రకారం వేరియంట్‌ని బట్టి ధర రూ. 87,999 నుంచి రూ. 1,89,999 (అల్ట్రా) వరకు ఉంటుంది. ప్రీఆర్డర్‌ చేసే వారికి రూ. 20,000 వరకు విలువ చేసే ప్రయోజనాలు లభిస్తాయి.

ఈ సిరీస్‌లోని అల్ట్రా వేరియంట్‌లో పరిశ్రమలోనే తొలిసారిగా ప్రైవసీ డిస్‌ప్లే ఫీచర్ ఉంది. స్క్రీన్‌ మీద ఉన్న కంటెంట్‌ పక్క వారికి కనిపించకుండా కేవలం యూజరుకు మాత్రమే కనిపించేలా సెట్టింగ్స్‌ని మార్చుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. ప్రయాణాలు చేస్తున్నప్పుడు, ఇతరులతో ఉన్నప్పుడు ప్రైవసీని కాపాడుకునేందుకు సహాయకరంగా ఉంటుంది. శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్‌ 8 ఎలీట్‌ జెన్‌ 5 ప్రాసెసర్, 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, అరగంటలోనే 75 శాతం చార్జ్‌ అయ్యేలా సూపర్‌ ఫాస్ట్‌ చార్జింగ్‌ 3.0, 50 ఎంపీ, అల్ట్రా వైడ్‌ కెమెరా, 200 ఎంపీ వైడ్‌ కెమెరా, 256 జీబీ నుంచి 1 టీబీ వరకు స్టోరేజ్‌ తదితర ఫీచర్లు ఉన్నాయి.  

దీనికి ముందు సిరీస్‌ తరహాలోనే ఈ ఫోన్లను కూడా భారత్‌లోని నోయిడా ప్లాంటులో ఉత్పత్తి చేయనున్నట్లు శాంసంగ్‌ తెలిపింది. దక్షిణ కొరియా వెలుపల, బెంగళూరులోని తమ ఆర్‌అండ్‌డీ సెంటర్‌ వీటిని అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించినట్లు వివరించింది. ఈ సిరీస్‌తో దేశీయంగా యాపిల్‌ నుంచి పోటీ నెలకొన్న 800 డాలర్ల ఎగువ ధర పలికే సూపర్‌ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ సెగ్మెంట్లో శాంసంగ్‌ తన స్థానాన్ని పటిష్టం చేసుకునే అవకాశం లభించవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)