Breaking News

శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌23 వస్తోంది.. ఆ స్మార్ట్‌ఫోన్‌ ధర భారీగా తగ్గింది!

Published on Thu, 02/02/2023 - 11:45

కొత్త మొబైల్‌ కొనుగోలు చేయాలనుకునే వారికి శుభావార్త. ఎప్పటికప్పుడు లేటెస్ట్‌ స్మార్ట్‌ ఫోన్‌ మోడళ్లను మార్కెట్‌లోకి తీసుకొస్తున్న శాంసంగ్‌ కంపెనీ తాజాగా గెలాక్సీ ఎస్‌23 వేరియంట్లను గ్రాండ్‌గా లాంచ్‌ చేసింది. గెలాక్సీ ఎస్‌23, గెలాక్సీ ఎస్‌23 ప్లస్‌, గెలాక్సీ ఎస్‌23 అల్ట్రా మోడళ్లను ఆవిష్కరించింది. అయితే శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌23 రాకతో గెలాక్సీ ఎస్‌22 ధర భారీగా తగ్గింది.

ఒక ఫోన్‌ లాంచ్‌.. మరొక ఫోన్‌ భారీగా తగ్గింపు
ఈ స్మార్ట్‌ ఫోన్‌ శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌22 సిరీస్‌లో స్టాండర్డ్‌ మోడల్‌. గతేడాది గెలాక్సీ ఎస్‌22 ప్లస్‌, గెలాక్సీ ఎస్‌22 అల్ట్రా మోడళ్లతోపాటు ఇది లాంచ్‌ అయింది. శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌22 లాంచ్‌ చేసినప్పుడు దీని ధర రూ.72,999. ఇప్పుడు 'గెలాక్సీ ఎస్‌23 సిరీస్‌ను విడుదల చేసిన నేపథ్యంలో గెలాక్సీ ఎస్‌22 స్టాండర్డ్‌ మోడల్‌ ఫోన్‌ ధరను కంపెనీ భారీగా తగ్గించింది. ఈ ఫోన్‌ ధర ఇప్పుడు రూ.57,999. అలాగే ఇందులో 256జీబీ వేరియంట్‌ ధర రూ.61,999. శాంసంగ్‌ ఎస్‌22 ఫోన్‌ స్క్రీన్‌ సైజ్‌ 6.1 ఇంచులు. 120హెడ్జ్‌ వరకు రిఫ్రెష్‌ రేటుతో ఎఫ్‌హెచ్‌డీ ప్లస్‌ డిస్ల్పేని కలిగి ఉంది.

క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్‌ 8 జనరేషన్‌ 1 చిప్‌సెట్‌ను కలిగిన ఈ ఫోన్‌లో ట్రిపుల్‌ రేర్‌ కెమెరా సెటప్‌ ఉంటుంది. ఇందులో 50ఎంపీ మెయిన్‌ సెన్సర్‌, 12ఎంపీ అల్ట్రా వైడ్‌ కెమెరా, 10ఎంపీ టెలీఫోటో లెన్స్‌ ఉంటాయి. వీడియో కాల్స్‌, సెల్ఫీల కోసం 10ఎంపీ ఫ్రంట్‌ కెమెరా ఉంటుంది. 3,700 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 25 వాట్స్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌, 15 వాట్స్‌ వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌ దీని సొంతం. కొత్తగా లాంచ్‌ అయిన శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌23 కూడా దాదాపు ఇవే ప్రత్యేకతలను కలిగి ఉంటుంది. అయితే గెలాక్సీ ఎస్‌23లో కొత్త కలర్‌ ఆప్షన్లు, అధిక బ్యాటరీ సామర్థ్యం, క్వాల​్‌కాం స్నాప్‌డ్రాగన్‌ 8 జనరేషన్‌ 2 చిప్‌సెట్‌ ఉన్నాయి.

చదవండి: Union Budget 2023-24 బీమా కంపెనీలకు షాక్‌, రూ. 5 లక్షలు దాటితే!

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)