Breaking News

9,400 మందికి ట్రెయినింగ్‌.. స్టైపెండ్‌

Published on Sat, 11/29/2025 - 15:01

భారత్‌లో అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ బ్రాండ్స్‌లో ఒకటైన శామ్‌సంగ్ తన ఫ్లాగ్‌షిప్ ‘శామ్‌సంగ్ డిజిటల్ అండ్‌ ఆఫ్‌లైన్ స్కిల్స్ ట్రైనింగ్ (దోస్త్) సేల్స్’ కార్యక్రమాన్ని విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. ఈ కార్యక్రమంలో భాగంగా 9,400 మంది యువతకు ఫ్రంట్‌లైన్ రిటైల్ ఉద్యోగాల కోసం శిక్షణ ఇవ్వబోతున్నట్లు తెలిపింది. నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తిని తయారు చేయడం ద్వారా ఆర్థిక వృద్ధిని సాధించాలని శామ్‌సంగ్ యోచిస్తోంది.

2021లో భారత్‌లో దోస్త్ సేల్స్ కార్యక్రమం  ప్రారంభించినప్పటి నుంచి వేగంగా విస్తరిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ ఏడాది దోస్త్ సేల్స్ 4.0తో శామ్‌సంగ్ తన స్కిల్లింగ్ మిషన్‌ను రెట్టింపు చేస్తోంది. ఈ కార్యక్రమం ఎలక్ట్రానిక్స్ సెక్టార్ స్కిల్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ESSCI), టెలికాం సెక్టార్ స్కిల్స్ కౌన్సిల్ (TSSC) భాగస్వామ్యంతో జరుగుతోంది. ఈ విస్తరణపై శామ్‌సంగ్‌ ఈస్టర్న్‌ ఏషియా హెడ్, సీఎస్ఆర్, కార్పొరేట్ కమ్యూనికేషన్స్ శుభమ్ ముకర్జీ మాట్లాడుతూ.. ‘దేశ అభివృద్ధిలో భాగంగా భారత యువతకు సాధికారత కల్పించాలన్న శామ్‌సంగ్ నిబద్ధతను ఈ కార్యక్రమం హైలైట్‌ చేస్తుంది. ఐదు నెలల శిక్షణా కార్యక్రమమైన దోస్త్ సేల్స్ యువతకు రిటైల్ రంగంలో రాణించడానికి అవసరమైన నైపుణ్యాలు అందిస్తుంది. ఈ ఏడాది ఈ కార్యక్రమంలో నమోదు మూడు రెట్లు పెరిగింది’ అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ప్రతి ట్రైయినీ ESSCI, TSSC నుంచి సర్టిఫికేషన్‌ పొందుతారు. శిక్షణలో భాగంగా ట్రైనర్ల నేతృత్వంలో 120 గంటల ఆన్‌లైన్ తరగతి గది సెషన్లుంటాయి. శామ్‌సంగ్ రిటైల్ సేల్స్ టీమ్ ద్వారా 60 గంటల శిక్షణ పొందుతారు. శిక్షణా పాఠ్యప్రణాళికలో కస్టమర్ ఇంటరాక్షన్, కమ్యూనికేషన్, అమ్మకాల ప్రాథమిక అంశాలు, రిటైల్ ప్రక్రియలు, ప్రోడక్ట్ పరిజ్ఞానం వంటి కీలక నైపుణ్యాలను వివరిస్తారు. ఆన్‌-ది-జాబ్‌ ట్రెయినింగ్‌లో భాగంగా దేశంలోని శామ్‌సంగ్ రిటైల్ స్టోర్‌లలో 5 నెలలపాటు పని చేయాల్సి ఉంటుంది. అందుకు కంపెనీ స్టైపెండ్‌ ఇస్తుంది. తర్వాత ప్రతిభ ఆధారంగా ఆన్‌రోల్‌ చేసే అవకాశం ఉంది.

#

Tags : 1

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)