Breaking News

9 నిమిషాల ఛార్జ్.. 965 కిమీ రేంజ్: ఇది కదా కావాల్సింది

Published on Sun, 08/04/2024 - 07:13

ఫ్యూయెల్ వాహనాలకు ప్రత్యామ్నాయంగా.. ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉపయోగించాలని చాలామంది చెబుతూనే ఉన్నారు. అయితే ఇప్పటికి కూడా ఈవీలను ఉపయోగించడానికి కొందరు వెనుకడుగు వేస్తున్నారు. దీనికి కారణం రేంజ్ విషయం సమస్య, కావలసినన్ని ఛార్జింగ్ స్టేషన్స్ అందుబాటులో లేకపోవడమే. ఛార్జింగ్ సమస్యలకు చెక్ పెట్టడానికి & ఎక్కువ రేంజ్ అందించడానికి శాంసంగ్‌ ఓ బ్యాటరీ రూపొందించింది.

కొరియన్ బ్రాండ్ శాంసంగ్‌ రూపొందించిన బ్యాటరీ కేవలం 9 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ చేసుకోగలదు. అంతే కాకుండా ఇది సింగిల్ ఛార్జ్‌తో ఏకంగా 965 కిమీ రేంజ్ అందిస్తుంది. వీటి జీవిత కాలం 20 ఏళ్ళు కావడం గమనార్హం. అంటే ఒక వాహనంలో శాంసంగ్‌ బ్యాటరీ ఫిక్స్ చేసుకుంటే అది 20 సంవత్సరాలు మనగలుగుతోంది. ఇది చాలా గొప్ప విషయం.

శాంసంగ్‌ బ్యాటరీ వివిధ పరిమాణాలలో లభిస్తుంది. కాబట్టి దీనిని కారు, బస్సు ఇలా వివిధ వాహనాల్లో నిక్షిప్తం చేసుకోవచ్చు. ఇవి సాధారణ బ్యాటరీల కంటే కూడా రెట్టింపు సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. అందులోనూ ఈ బ్యాటరీ కేవలం 9 నిమిషాల్లో ఛార్జ్ అవుతుంది. కాబట్టి వాహన వినియోగదారుల సమయాన్ని చాలా ఆదా చేస్తుంది.

దక్షిణ కొరియాలోని సియోల్‌లో జరిగిన SNE బ్యాటరీ డే 2024 ఎక్స్‌పోలో, కంపెనీ తన పైలట్ సాలిడ్ స్టేట్ బ్యాటరీ గురించి వెల్లడించింది. అయితే ప్రస్తుతం దీనిని పలు వాహనాల్లో పరీక్షిస్తోంది. 2027 నాటికి అధిక సంఖ్యలో ఈ బ్యాటరీల ఉత్పత్తి చేయనున్నట్లు తెలిపింది.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)