Breaking News

లిస్టింగ్‌కు శాంసంగ్‌ నో 

Published on Fri, 12/26/2025 - 05:25

న్యూఢిల్లీ: దేశీయంగా లిస్టింగ్‌ యోచన లేదని దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్‌ ఎల్రక్టానిక్స్‌ తాజాగా స్పష్టం చేసింది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ)పై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు తెలియజేసింది. వివిధ ప్రొడక్టులలో ఏఐను మరింత వినియోగించనున్నట్లు పేర్కొంది. కంపెనీకి అత్యంత ముఖ్యమైన దేశీ మార్కెట్లో అమ్మకాలు పెంచుకునేందుకు వీలుగా కన్జూమర్‌ ఫైనాన్స్‌ విభాగాన్ని విస్తరించనున్నట్లు తెలియజేసింది. 

భారత్‌లో తయారీ కార్యకలాపాలను మరింత లోతుగా విస్తరించే యోచనలో ఉన్నట్లు శాంసంగ్‌  నైరుతి ఆసియా ప్రెసిడెంట్, సీఈవో జేబీ పార్క్‌ తెలియజేశారు. దేశీయంగా మొబైల్‌ ఫోన్‌ డిస్‌ప్లేల తయారీపై ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకానికి(పీఎల్‌ఐ) దరఖాస్తు చేసినట్లు వెల్లడించింది. ప్రపంచంలోనే మొబైల్‌ ఫోన్‌ తయారీకి నోయిడాలో అతిపెద్ద ప్లాంటును నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలకాలంలో ఇది కీలక ఎగుమతుల కేంద్రంగా ఆవిర్భవించింది.

 కాగా.. దేశీయంగా ఐపీవో చేపట్టడంపై స్పందిస్తూ పార్క్‌ ప్రస్తుతానికి అలాంటి ప్రణాళికలులేవని స్పష్టం చేశారు. అయితే ఇతర దక్షిణ కొరియా దిగ్గజాలు హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా, ఎల్‌జీ ఎల్రక్టానిక్స్‌ ఇటీవల పబ్లిక్‌ ఇష్యూతో నిధుల సమీకరణ చేపట్టడం ద్వారా దేశీ స్టాక్‌ ఎక్సే్ఛంజీలలో లిస్టయిన విషయం విదితమే. తద్వారా దేశీ కార్యకలాపాలను మరింత పటిష్ట పరచుకుంటున్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. వృద్ధికి అవసరమైన పెట్టుబడులను కలిగి ఉన్నట్లు పార్క్‌ తెలియజేశారు. అవసరమైతే కార్పొరేట్‌ బాండ్ల జారీ లేదా సంస్థాగత రుణాలు తదితర మార్గాలలో నిధులు సమకూర్చుకోనున్నట్లు వివరించారు. 
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)