భారత్‌లో టెస్లాకు అంత ఈజీ కాదు 

Published on Fri, 03/07/2025 - 05:23

న్యూఢిల్లీ: భారత్‌లో తీవ్ర పోటీ నెలకొన్న నేపథ్యంలో అమెరికన్‌ ఎలక్ట్రిక్‌ కార్ల దిగ్గజం టెస్లాకు ఇక్కడి మార్కెట్‌పై పట్టు సాధించడం అంత సులువు కాదని జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌ చైర్మన్‌ సజ్జన్‌ జిందాల్‌ వ్యాఖ్యానించారు. టాటా మోటార్స్, మహీంద్రా అండ్‌ మహీంద్రాలాంటి దేశీ దిగ్గజాల తరహాలో అది రాణించలేకపోవచ్చని తెలిపారు. ఎర్న్‌స్ట్‌ అండ్‌ యంగ్‌ ‘ఎంట్రప్రెన్యూర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు చెప్పారు. ‘‘మస్క్‌ చాలా స్మార్ట్‌. అందులో సందేహం లేదు. ఆయన చాలా గొప్ప పనులు చేస్తున్నారు. 

కానీ ఆయన ఉన్నది అమెరికాలో, భారత్‌లో కాదు. ఇక్కడ విజయం సాధించాలంటే అంత సులభం కాదు. మహీంద్రా, టాటాల్లాగా ఆయన రాణించలేరు’’ అని జిందాల్‌ పేర్కొన్నారు. ఈవీల దిగుమతులపై టారిఫ్‌ల తగ్గింపు అవకాశాలతో భారత మార్కెట్లో ప్రవేశించేందుకు టెస్లా సన్నాహాలు చేసుకుంటున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌ కూడా ఈవీ సెగ్మెంట్లో అవకాశాలను అందిపుచ్చుకునే ప్రయత్నాల్లో ఉంది. చైనాకు చెందిన ఎస్‌ఏఐసీ కార్పొరేషన్‌తో ఏర్పాటు చేసిన జాయింట్‌ వెంచర్‌ సంస్థ జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటర్‌ ఇండియా ఇటీవలే ఎలక్ట్రిక్, ప్లగ్‌–ఇన్‌ హైబ్రిడ్స్‌ మొదలైన పలు వాహనాలను ప్రదర్శించింది.  
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)