Breaking News

సహారా డిపాజిటర్లకు గుడ్‌న్యూస్‌.. రిఫండ్‌ పరిమితి పెంపు

Published on Thu, 09/19/2024 - 08:04

న్యూఢిల్లీ: సహారా గ్రూప్‌ కోఆపరేటివ్‌ సొసైటీల చిన్న డిపాజిటర్ల రిఫండ్‌ మొత్తాలపై గతంలో ఉన్న రూ.10,000 పరిమితిని ప్రభుత్వం రూ.50,000కు పెంచింది. సహకార మంత్రిత్వ శాఖ సీనియర్‌ అధికారి ఒకరు ఈ విషయాన్ని తెలిపారు.

సహారా గ్రూప్‌ ఆఫ్‌ కోఆపరేటివ్‌ సొసైటీలకు చెందిన 4.29 లక్షల మందికి పైగా డిపాజిటర్లకు ప్రభుత్వం ఇప్పటివరకు సీఆర్‌సీఎస్‌ (సహకార సంఘాల సెంట్రల్‌ రిజిస్ట్రార్‌)–సహారా రిఫండ్‌ పోర్టల్‌ ద్వారా రూ.370 కోట్లను విడుదల చేసింది. రిఫండ్‌ మొత్తం పరిమితిని రూ. 50,000కి పెంచడంతో, రాబోయే 10 రోజుల్లో సుమారు రూ. 1,000 కోట్ల చెల్లింపులు జరుగుతాయని అధికారి వెల్లడించారు.

సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా చర్యలు 
సహారా గ్రూప్‌  నాలుగు మల్టీ–స్టేట్‌ కోఆపరేటివ్‌ సొసైటీల వాస్తవ డిపాజిటర్లు క్లెయిమ్‌ల సమర్పణకు, డిపాజిట్ల వాపసుకు సుప్రీంకోర్డు ఆదేశాలను అనుసరించి   సీఆర్‌సీఎస్‌–సహారా రిఫండ్‌ పోర్టల్‌ గత ఏడాది జూలై 18న ఏర్పాటయిన సంగతి తెలిసిందే.

వీటిలో  స్టార్స్‌ మల్టీపర్పస్‌ కోఆపరేటివ్‌ సొసైటీ లిమిటెడ్‌ (హైదరాబాద్‌)సహా సహారా క్రెడిట్‌ కోఆపరేటివ్‌ సొసైటీ లిమిటెడ్‌ (లక్నో) సహారైన్‌ యూనివర్సల్‌ మల్టీపర్పస్‌ సొసైటీ లిమిటెడ్‌  (భోపాల్‌), హుమారా ఇండియా క్రెడిట్‌ కోఆపరేటివ్‌ సొసైటీ లిమిటెడ్‌ (కోల్‌కతా) ఉన్నాయి.

2023 మార్చి 29 నాడు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా 2023 మే 19న సెబీ–సహారా రీఫండ్‌ ఖాతా నుండి సెంట్రల్‌ రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కోఆపరేటివ్‌ సొసైటీస్‌కి రూ. 5,000 కోట్ల బదిలీ అయ్యాయి. డిజిటల్‌ రూపంలో డబ్బు పంపిణీని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌ సుభాష్‌ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు.

Videos

వైరల్ అవుతున్న ప్రభాస్ చెల్లెల లేటెస్ట్ ఫోటోలు..

చెవిరెడ్డి పోరాటం.. నామినేషన్లు సక్సెస్

ఏపీ స్థానిక ఎన్నికలపై సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు

విజయవాడలో YSRCP ఎన్నికల ప్రచార హోరు

కడప ZP ఆఫీస్ లో నామినేషన్ల స్క్రూటినీ.. వీడియో వైరల్

మహిళలపై TDP మూకలు ఎలా దాడి చేశారో చూడండి

చింతమనేని మోసం చేశాడు.. వాపోయిన జనసేన దెందులూరు ఇంచార్జ్ వెంకటలక్ష్మి

ప్రచారంలో దూసుకుపోతున్న YSRCP వరుదు కళ్యాణి

మార్కెట్లో జియో మెగా సునామీ.. అప్లై చేసిన వారికి షేర్లు దక్కుతాయా?

ABN రాధాకృష్ణ... నీ ఫామ్ హౌస్ బాగోతం.. కారుమూరి సంచలన కామెంట్స్

Photos

+5

నిండుగా రెడీ అయిన అదాశర్మ (ఫొటోలు)

+5

ఎన్నాళ్లకెన్నాళ్లకు 'కొత్త బంగారు లోకం' బ్యూటీ ఇలా (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్