వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్
Breaking News
రెడిట్ ప్రచారకర్తగా సచిన్ టెండుల్కర్
Published on Thu, 06/19/2025 - 06:30
న్యూఢిల్లీ: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ తాజాగా సోషల్ మీడియా ప్లాట్‌ఫాం రెడిట్‌కు ప్రచారకర్తగా వ్యవహరించనున్నారు. ఇకపై తన రెడిట్ ప్రొఫైల్ ద్వారా తన అభిప్రాయాలు, మ్యాచ్‌ల విశ్లేషణ, ఎక్స్‌క్లూజివ్ కంటెంట్‌ను ఆయన షేర్ చేస్తారు. అలాగే భారత్‌తో పాటు ఇతరత్రా మార్కెట్ల కోసం రూపొందించే కొత్త మార్కెటింగ్ ప్రచార ప్రకటనల్లో ఆయన కనిపిస్తారని కంపెనీ వివరించింది.
వివిధ వర్గాలందరినీ ఒక చోటికి చేర్చే రెడిట్‌తో జట్టు కట్టడం సంతోషకరమైన విషయమని టెండుల్కర్ తెలిపారు. శ్రేష్టమైన క్రికెట్‌కు టెండుల్కర్ పేరు పర్యాయపదమని రెడిట్ వైస్ ప్రెసిడెంట్ దుర్గేశ్ కౌశిక్ వివరించారు. తమ ప్లాట్‌ఫాంలో క్రీడలపై ఆసక్తి వార్షికంగా 30 శాతం పెరగడంతో స్పోర్ట్స్ కంటెంట్‌కి మరింత ప్రాధాన్యం ఇవ్వడం మీద రెడిట్ దృష్టి పెడుతోంది. ఈ మధ్యే ఇటాలియన్ ఫుట్‌బాల్ లీగ్ సిరీ ఏ, గతేడాది ఎన్‌ఎఫ్‌ఎల్, ఎన్‌బీఏ, ఎంఎల్‌బీ తదితర అమెరికన్ ప్రొఫెషనల్ స్పోర్ట్స్ లీగ్‌లతో ఒప్పందాలు కుదుర్చుకుంది.
Tags : 1