Breaking News

పుంజుకున్న ‘తయారీ’

Published on Sat, 09/02/2023 - 06:22

న్యూఢిల్లీ: భారత్‌ తయారీ రంగం కార్యకలాపాలు ఆగస్టులో ఊపందుకున్నాయి. ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్‌ పర్చేజింగ్‌ మేనేజర్స్‌ ఇండెక్స్‌ (పీఎంఐ) జూలైలో 57.7 వద్ద ఉంటే, ఆగస్టులో 58.6కు ఎగసింది.  దాదాపు మూడు సంవత్సరాల్లో ఎన్నడూ లేని స్థాయిలో కొత్త ఆర్డర్‌లు, ఉత్పత్తి త్వరితగతిన పెరగడం దీనికి కారణమని శుక్రవారం విడుదలైన సర్వే  పేర్కొంది. కాగా,  సూచీ 50పైన ఉంటే దానిని వృద్ధి ధోరణిగానే పరిగణిస్తారు. ఆ దిగువకు పడిపోతేనే క్షీణతగా భావిస్తారు.

ఈ ప్రాతిపదికన  తయారీ రంగం వరుసగా 26 నెలల నుంచి వృద్ధి బాటన కొనసాగుతోంది.  కొత్త ఆర్డర్లు తయారీ రంగానికి  ఉత్సాహాన్ని ఇస్తున్నట్లు ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ మార్కిట్‌ ఇంటిలిజెన్స్‌ ఎకనమిక్స్‌ అసోసియేట్‌ డైరెక్టర్‌ పోలీయానా డీ లిమా పేర్కొన్నారు.  మొత్తం పారిశ్రామిక ఉత్పత్తిలో తయారీ రంగం వాటా దాదాపు 70 శాతంగా ఉన్న సంగతి తెలిసిందే. ప్యానల్‌లోని దాదాపు 400 తయారీ రంగ  సంస్థల పర్చేజింగ్‌ మేనేజర్స్‌కు పంపిన ప్రశ్నలు, అందిన సమాధానాల ప్రాతిపదికన సూచీ కదలికలు ఉంటాయి. 2005 మార్చిలో ఈ గణాంకాల సేకరణ ప్రారంభమైంది.   

Videos

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)