Breaking News

అయ్యో... రూ‘పాయే’

Published on Wed, 12/03/2025 - 00:07

న్యూఢిల్లీ: చరిత్రలో అత్యంత కనిష్టానికి రూపాయి విలువ పడిపోయింది. స్పెక్యులేటర్ల నుంచి భారీగా షార్ట్‌ కవరింగ్,  దిగుమతిదారుల నుంచి అమెరికా కరెన్సీకి డిమాండ్‌ కొనసాగడం దేశీయ కరెన్సీపై తీవ్ర ఒత్తిడి పెంచాయి. ఫలితంగా డాలర్‌ మారకంలో రూపాయి విలువ 43 పైసలు బలహీనపడి జీవితకాల కనిష్టం 89.96 వద్ద స్థిరపడింది. ఎఫ్‌ఐఐలు వరుస విక్రయాలు, అమెరికా–భారత్‌ల వాణిజ్య ఒప్పందం ఆలస్యం కావడం తదితర అంశాలు సెంటిమెంట్‌ను దెబ్బతీశాయని ఫారెక్స్‌ ట్రేడర్లు తెలిపారు.

ఉదయం ఫారెక్స్‌ మార్కెట్లో 89.70 వద్ద మొదలైంది. ఒక దశలో 47 పైసలు కుప్పకూలి 90.00 స్థాయి వద్ద ఇంట్రాడే రికార్డు కనిష్టాన్ని నమోదు చేసింది. ‘‘సాంకేతికంగా రూపాయి 90 స్థాయిపై ముగిసినట్లయితే.., ఆ పైన స్థాయిల్లో బై–స్టాప్‌ ఆర్డర్లు మరిన్ని ఉండొచ్చు. కావున 90కి దిగువునే ఆర్‌బీఐ జోక్యం చేసుకోవాలి.

లేకపోతే 91 స్థాయిని ఛేదించేందుకు మరెంతో సమయం పట్టదు. అంతంకంతా పెరుగుతున్న వాణిజ్య లోటు రూపాయిపై మరింత భారాన్ని పెంచుతోంది. అయితే డిసెంబర్‌లో వడ్డీరేట్ల తగ్గింపు, ఆర్‌బీఐ జోక్యం చేసుకోవచ్చనే ఆశావహ అంచనాలతో రానున్న రోజుల్లో రూపాయి 89.60 – 90.20 శ్రేణిలో ట్రేడవ్వచ్చు’’ అని కోటక్‌ సెక్యూరిటీస్‌ కమోడిటీ, కరెన్సీ హెడ్‌ అనింద్య బెనర్జీ తెలిపారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)