Breaking News

ఫెడ్‌ సెగ: రికార్డు కనిష్టానికి రూపాయి

Published on Thu, 09/22/2022 - 10:14

సాక్షి, ముంబై: అమెరికా డాలరు మారకంలో దేశీయ కరెన్సీ రూపాయి భారీగా నష్టపోతోంది. ప్రస్తుతం 73 పైసలు కోల్పోయి 80.56 వద్ద ఆల్‌టైమ్ కనిష్ట స్థాయిని నమోదు చేసింది. గురువారం ఆరంభంలోనే డాలర్‌తో రూపాయి మారకం విలువ 42 పైసలు క్షీణించి  80.38కి చేరుకుంది. ఆ తరువాత మరింత క్షీణించింది. బుధవారం 79.98 వద్ద ముగిసింది. (StockMarketOpening: లాభనష్టాల ఊగిసలాట)

మరోవైపు దేశీయ స్టాక్‌మార్కెట్లు కూడా నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 155 పాయింట్లు క్షీణించి 59301 వద్ద, నిఫ్టీ 44 పాయింట్లు నష్టంతో 17673 వద్ద కొనసాగుతోంది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వరుసగా మూడవసారి వడ్డీ రేట్లను 75 బీపీఎస్‌ పాయింట్లు పెంచిన సంగతి తెలిసిందే. దీంతో అమెరికా డాలరు బలం పుంజుకుంది. ఫలితంగా ఆసియా కరెన్సీలు ఒత్తిడిలో ఉన్నాయి.

భవిష్యత్తు ఇంధన డిమాండ్‌పై అనుమానాల నేపథ్యంలో అంతర్జాతీయంగా చమురు ధరలు కూడా క్షీణించాయి. ఇదిఇలా ఉంటే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ ప్రకటన అంతర్జాతీయంగా ప్రకంపనలు  పుట్టిస్తోంది.  3 లక్షల మంది సైనికుల పాక్షిక మొబిలైజేషన్‌ ప్రకటన ఉక్రెయిన్‌పై యుద్ధ  తీవ్రతను పెంచుతోందని  భావిస్తున్నారు. 

Videos

మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం

ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ Conflict 2025

Rain Alert: మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు

KTR: నీ కేసులకు భయపడేది లేదు

రేషన్ డోర్ డెలివరీ రద్దుపై వైఎస్ జగన్ రియాక్షన్..

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్

Operation Trashi: టాప్ 6 ఉగ్రవాదులు హతం..

MLAని అని చెప్పుకోవాలంటే సిగ్గుగా ఉంది: Bandaru Satyanarayana

తమిళనాడు లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టు స్టే

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నాం : ప్రధాని మోదీ

Photos

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)

+5

'హరి హర వీరమల్లు' సాంగ్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)