Breaking News

ఐపీవోకి  ఆర్‌ఎస్‌ బ్రదర్స్‌ 

Published on Sat, 08/16/2025 - 05:48

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: దుస్తుల రిటైలింగ్‌ సంస్థ ఆర్‌ఎస్‌బీ రిటైల్‌ ఇండియా (ఆర్‌ఎస్‌ బ్రదర్స్‌) పబ్లిక్‌ ఇష్యూకి రానుంది. ఇందుకు సంబంధించి మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ దాఖలు చేసింది. దీని ప్రకారం రూ. 500 కోట్ల విలువ చేసే షేర్లను తాజాగా జారీ చేయనుండగా, 2.98 కోట్ల షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌) కింద ప్రమోటర్లు విక్రయించనున్నారు. 

ఇష్యూ ద్వారా సమీకరించిన నిధుల్లో రూ. 275 కోట్లను నిర్దిష్ట రుణాల చెల్లింపునకు, రూ. 118 కోట్ల మొత్తాన్ని ఆర్‌ఎస్‌ బ్రదర్స్, సౌతిండియా షాపింగ్‌ మాల్‌ ఫార్మాట్లలో కొత్త స్టోర్స్‌ను ఏర్పాటు చేసేందుకు కంపెనీ వినియోగించుకోనుంది. సంస్థకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలో మొత్తం 73 స్టోర్స్‌ ఉన్నాయి. సౌతిండియా షాపింగ్‌ మాల్, ఆర్‌ఎస్‌ బ్రదర్స్, కాంచీపురం నారాయణి సిల్క్స్, డి రాయల్, వేల్యూ జోన్‌ హైపర్‌మార్ట్‌ పేరిట వివిధ ఫార్మాట్లలో స్టోర్స్‌ నిర్వహిస్తోంది. పొట్టి వెంకటేశ్వర్లు, సీర్న రాజమౌళి, తిరువీధుల ప్రసాద రావు తదితరులు ప్రమోటర్లుగా ఉన్నారు. 2024–25లో కంపెనీ రూ. 2,694 కోట్ల ఆదాయం, రూ. 104 కోట్ల లాభం నమోదు చేసింది.  
 

Videos

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)