Breaking News

రూ.8 వేలకోట్ల ఎగవేతకు ప్రణాళిక.. సూత్రధారి అరెస్ట్‌

Published on Mon, 10/28/2024 - 14:23

దేశంలో జీఎస్టీ ఎగవేత మోసాలు ఎక్కువవుతున్నాయి. రూ.5,000 కోట్లు-రూ.8,000 కోట్ల విలువైన జీఎస్టీని ఎగవేసేందుకు 246 బోగస్‌ కంపెనీలను సృష్టించిన ముఠా గుట్టు రట్టయింది. ఈ ఘటనకు ప్రధాన సూత్రధారిగా వ్యవహరించిన అస్రఫ్ ఇబ్రహీం కలవాడియా(50) సహా ఎనిమిది మంది వ్యక్తులపై పుణె పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ బృందం నకిలీ పత్రాలు, సంస్థలను సృష్టించి మోసపూరిత లావాదేవీలకు పాల్పడినట్లు గుర్తించారు.

పుణెలోని కోరేగావ్‌ పార్క్‌ పోలీసుల కథనం ప్రకారం..సూరత్‌కు చెందిన అస్రఫ్ ఇబ్రహీం కలవాడియా (50) సహా ఎనిమిది మంది వ్యక్తులు భారీగా జీఎస్టీ ఎగవేతకు పాల్పడ్డారు. దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లో 246 బోగస్‌ కంపెనీలు సృష్టించి ఈ చర్యకు పూనుకున్నారు. దీనివల్ల ప్రభుత్వానికి ఏకంగా రూ.5000 కోట్లు-రూ.8000 కోట్లు వరకు నష్టం జరుగుతుంది. సెప్టెంబర్ 2018-మార్చి 2024 మధ్య వివిధ కంపెనీలపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో విచారణ జరిగింది. పుణెకు చెందిన హడప్‌సర్‌లోని శివ చైతన్య కాలనీ చిరునామాతో రిజిస్ట్రర్‌ అయిన పఠాన్ ఎంటర్‌ప్రైజెస్ రూ.20.25 కోట్ల జీఎస్టీను ఎగవేసినట్లు అధికారులు గుర్తించారు. దాంతో జీఎస్టీ సిబ్బంది ఫిర్యాదు నమోదు చేసింది. దీనిపై విచారణ జరిపి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ (డీజీజీఐ) జోనల్‌ యూనిట్‌ అధికారులు పుణె పోలీసుల సహకారంతో కలవాడియాను ఎరవాడ సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ సంఘటనలో తనకు సహకరించిన మరో ఏడుగురు నిందితులు ఇంకా పరారీలో ఉన్నారు.

ఆటోరిక్షా డ్రైవర్‌ పేరుతో కంపెనీ నమోదు

పఠాన్ షబ్బీర్ ఖాన్ అన్వర్ ఖాన్ అనే వ్యక్తి పాన్‌కార్డుతో పఠాన్ ఎంటర్‌ప్రైజెస్ అనే సంస్థను నమోదు చేశారు. గుజరాత్‌లోని భావ్‌నగర్‌లోని ఖుంబర్‌వాడ ప్రాంతానికి చెందిన పఠాన్‌ ఆటోరిక్షా నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. పాన్‌కార్డులో నమోదైన చిరునామాతో పోలీసులు తన ఇంటికి వెళ్లేసరికి అసలు సంగతి వెలుగులోకి వచ్చింది. తనకు ఈ వ్యవహారానికి ఎలాంటి సంబంధం లేదని చెప్పాడు. నిందితులు చట్ట విరుద్ధంగా పఠాన్‌ పాన్‌కార్డు వాడి కంపెనీ నమోదు చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.

ఇదీ చదవండి: డిఫెన్స్‌ ఉత్పత్తులు ఎగుమతయ్యే టాప్‌ 3 దేశాలు

సెక్యూరిటీగార్డు పేరుతో బ్యాంకు ఖాతా

తదుపరి విచారణలో గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో జీత్ కుకాడియా అనే పేరుతో బ్యాంక్ ఖాతా తెరిచారు. కుకాడియా సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. ఈ నేరంతో తనకు సంబంధం లేదని ఆయన తెలిపారు. బ్యాంకు స్టేట్‌మెంట్‌లు, కాల్‌ రికార్డులను పరిశీలించిన తర్వాత ఈ ఘటనకు కలవాడియాను ప్రధాన సూత్రధారిగా గుర్తించామని సీనియర్‌ ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌ ప్రకాశ్‌ తెలిపారు. ముంబైలోని మీరా భయాందర్‌లోని ఒక హోటల్‌లో కలవాడియాను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. తన వద్ద నుంచి సెల్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, సిమ్ కార్డ్‌లు, చెక్ బుక్‌లు, డెబిట్ కార్డ్‌లు, రబ్బర్ స్టాంపులు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. పన్ను ఎగవేత కోసం మోసపూరిత లావాదేవీలు జరిపేందుకు నకిలీ పత్రాలను ఉపయోగించినట్లు కలవాడియా అంగీకరించాడని ప్రకాశ్‌ వివరించారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)